టీవీ : ఇకపై సీరియల్ లో కనిపించబోము అంటున్న డాక్టర్ బాబు..కారణం..?

Divya
బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అందులో డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్ లు ప్రతి ఒక్కరి మనసు లో బాగా నాటుకుపోయాయి. అయితే ఇప్పుడు సీరియల్ లో వాళ్లు లేకుండా సీరియల్ కొనసాగించడం అంటే.. అది కత్తి మీద సాము లాంటిది అని చెప్పవచ్చు. దీంతో ఈ విషయం తెలియగానే డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర ని బండ బూతులు తిడుతున్నారు నెటిజెన్స్.
ప్రస్తుతం టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్.. గత కొన్ని నెలల నుంచి రేటింగ్ పరంగా కాస్త తగ్గుతూ ఉండడంతో.. డైరెక్టర్ తెలివిగా ఆలోచించి చిక్ మంగుళూరు ఎపిసోడ్ ని ప్రారంభించడంతో మళ్లీ రేటింగ్ లో కాస్త మంచి పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. ఇక అలాంటి సమయంలోనే ఏకంగా దీప,  కార్తీక్ లను తీసేసాడు డైరెక్టర్. ఇక అంతే కాకుండా యాక్సిడెంట్లో కార్తీక్,  దీపాలను చనిపోయినట్లుగా చూపించి.. వారిద్దరి ఫోటోలకు దండ వేసి ఈ సీరియల్స్ కి ముగింపు పలికే విధంగా ప్లాన్ చేశారు డైరెక్టర్. ఇక ఈ స్టోరీని వచ్చే జనరేషన్ కోసం షిఫ్ట్ చేస్తున్నానని చెప్పి తెలియజేశాడు.
ఇక వీరిద్దరి చనిపోవడానికి ముఖ్య కారణం హిమ నే అనే కారణంతో చూపించడంతో ఆమెపై సౌర్య పగ పడుతుంది. ఇక వీరిద్దరి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా సరికొత్త గా ఉంటుందని కార్తీకదీపం డైరెక్టర్ తెలియజేశారు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ అంటే ఇందులో కార్తీక్, దీప తప్ప మరే నటీ నటులకు అంతగా ఆధారం లేదని చెప్పవచ్చు. అయితే ఈ సీరియల్ చూసే వాళ్ళు కచ్చితంగా వీరు బతికి వస్తారని ప్రతి ప్రేక్షకుడు భావిస్తూ ఉన్నారు. కానీ ఈ షాకింగ్ ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ప్రస్తుతం తమ పిల్లలతోనే ఈ కథను నడిపించబోతున్నారు అంటే అది నిజమనే చెప్పారు డైరెక్టర్. ఇక డాక్టర్ బాబు కూడా కార్తీకదీపం సీరియల్ లో ఇకపై మేము కనిపించము అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: