టీవీ : మనసంతా నువ్వే సీరియల్ హీరో రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ సరిపోవని మరో సరికొత్త సీరియల్స్ కూడా ప్రేక్షకులను అలరించడానికి పోటీ పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో ని గత రెండు వారాల నుంచి ఈటీవీలో ప్రసారమవుతున్న తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సీరియల్ మనసంతా నువ్వే.. ఈ సీరియల్ పూర్తిగా కుటుంబం అలాగే కుటుంబానికి సంబంధించిన ప్రేమ ఎలా ఉంటుంది అని లైన్ పైన స్టోరీ రాయడం జరిగింది. ఇక ఈ సీరియల్ ప్రసారం అవుతున్నది కేవలం రెండు వారాలు అవుతున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ సీరియల్ కి హీరోగా ఏక్నాథ్ పరుచూరి.. హీరోయిన్ గా వింధూజా విక్రమన్ నటిస్తున్నారు.

ఇకపోతే ఏక్నాథ్ పరుచూరి రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. నేను శైలజ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మొదటి సీరియల్ తోనే ఎంతో మంది అభిమానులను తన నటనతో సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్లో రాయుడు పాత్ర పోషిస్తున్నాడు. ఈయన 1995 నవంబర్ 8 వ తారీకు నాడు జన్మించాడు. విజయవాడకు చెందిన ఈ అబ్బాయి విద్యాభ్యాసం విషయానికి వస్తే డిగ్రీ పూర్తి చేశాడు.

స్కూల్ విద్యాభ్యాసం రవీంద్రనాథ్ స్కూల్ లో.. ఇంటర్ ఎన్ఆర్ఐ అకాడమీ లో పూర్తి చేసారు.  చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండడం కారణం చేత హైదరాబాద్ వచ్చి నటనా రంగంలోకి అడుగులు వేశారు. ఇక అలా షార్ట్ ఫిలిమ్స్ లోకి అడుగు పెట్టి తన నటనను మొదలుపెట్టి నీది నాది ఒక కథే, జత కలిసే, లవ్ చేయాలా వద్దా , లేడీ రోమియో, అంతం కాదు ఆరంభం,మన్నించవా చెలియా, యుద్ధం చేయరా ప్రేమిక వంటి ఎన్నో షాట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: