టీవీ: ప్రాణం పోయే వరకు తనని వదలనంటున్న రష్మి.. కారణం..?

Divya
బుల్లితెరపై ప్రతివారం ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో తో ప్రేక్షకులను బాగా అలరించింది యాంకర్ రష్మీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటుంది. గ్లామర్ లుక్స్ తో పాటు కాస్త మానవత్వం కలిగిన మనిషి రష్మీ అని చెప్పవచ్చు. ఇక అప్పుడప్పుడు ఈమె కొన్ని ఎమోషనల్ పోస్ట్ చేస్తూ కూడా ఉంటుంది. అవి కాస్త వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేసింది. వాటి గురించి చూద్దాం.
యాంకర్ రష్మి కి మూగజీవాల అంటే ఎంతో ప్రీతి.. లాక్ డౌన్ సమయం లో రోడ్ల మీద ఉండే కొన్ని మూగజీవాలకు ఈమె ఆహారాన్ని అందించడం కూడా మనం చూసే ఉన్నాము. ఇక తన ఇంట్లో ఉండే మూగజీవాల పై కూడా మరింత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది రష్మీ. ఇక మూగజీవాలను హింసిస్తే ఈమె అసలు సహించలేదు. అలాంటి వాటిపై కూడా కొన్ని ఫైర్ కామెంట్లు చేస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు పెట్ లవ్ గురించి రష్మీ ఒక పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారుతోంది.
తను పెంచుకుంటున్న కుక్క చుట్కి ని గెట్టిగా హత్తుకున్న ఒక వీడియోని షేర్ చేసింది.. తన జీవితం అంతమయ్యేవరకు తనని వదిలి పెట్టాలని.. ఐ లవ్ మై బేబీస్ అంటూ కౌగిలించుకుంది. ఇక ఈ పోస్ట్ పై టస్కీ బ్యూటీ ప్రియమణి స్పందించడం కూడా జరిగింది.. రష్మి ఫేసులో లవ్ యాంగిల్ కనిపిస్తోంది అంటూ కామెంట్ చేయడం జరిగింది. ఇక రష్మికి జంతువుల పై ప్రేమ ఉండడంతో ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.. ఇక మరొక వైపు రష్మీ వివాహమైందని వార్తలు కూడా బాగా జోరుగా ప్రచారం అవుతున్నాయి. కానీ ఈ విషయం తను ఎక్కడ తెలియజేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: