టీవీ:యువ హీరో వల్లే రష్మీ కెరియర్ చిక్కుల్లో పడనుందా..?

Divya
యాంకర్ అంటే వేదికపై హాస్యాన్ని పండిస్తూ.. ప్రేక్షకులను నవ్విస్తూ ఉండాలి.. అంతేకాకుండా బుల్లితెర చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి. ఇలా చేశారంటే ఆ యాంకర్ కు తిరుగు ఉండదని చెప్పవచ్చు. ఇక యాంకర్ బాగా రాణించాలని ముఖ్యంగా భాష మీద పట్టు ఉండాలి. ఒకవేళ భాష మీద పట్టు లేనట్లయితే విఫలం అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. ఒకవేళ ఇలా ఉన్నట్లయితే వారి కెరియర్ లో చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంకర్ రష్మి ఒక ఇబ్బంది లో పడింది.. వాటి గురించి చూద్దాం.
ఇక ఈమె గురించి ప్రేక్షకులకు, అభిమానులకు బాగా తెలుసు. జబర్దస్త్ షో లో యాంకర్ గా పట్టు సాధించుకుంది ఈమె. ఇక ఆమె అమాయకపు మాటలతో, వచ్చీరాని భాషతో ప్రేక్షకులను బాగా ఆనందపరుస్తూ ఉంటుంది. దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. కానీ ఈమెకు తెలుగు రాకపోవడమే ఒక మైనస్ కారణమని చెప్పవచ్చు. తెలుగు మాట్లాడేటప్పుడు కాస్త తడ పడడంతో ఈమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ కేవలం గ్లామర్ తోనే పలు షో లను కూడా నెట్టుకొస్తుంది. అయితే రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈమె యాంకర్ గా చేసింది.ఇలాంటి సమయంలోనే ఈమె ఇబ్బంది పడినట్లు సమాచారం.
అలా యాంకరింగ్ చేస్తున్నప్పుడు రష్మి కి పోటీగా నవీన్ పోలిశెట్టి యాంకర్ గా రావడంతో ఒక్కసారిగా రష్మి ఇబ్బంది పడిందట.ఇక ఈ యువ హీరో ఎనర్జీకి తట్టుకోలేకపోయింది రష్మి.. దాంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. కేవలం ఇంతపెద్ద వేదికపై అవకాశం వచ్చిందని సంతోషించే లోపు.. నవీన్ పోలిశెట్టి వచ్చి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈమె ఛాన్స్ ఇవ్వకుండా చేశాడు.ఇక ఆమె పెట్టుకున్న ఆశలు అన్నీ వృధా అయిపోయాయి అని చెప్పవచ్చు. దీంతో ఆమెకు తెలియకుండానే ఆమె కెరీర్ చిక్కుల్లో పడింది అని కొంత మంది నెటిజన్లు కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: