టీవీ: ఇంద్రజ పై మనసు పారేసుకున్న వర్మ..!!

Divya
 వివాదాస్పద లకే పెట్టింది పేరు RGV. సినీ ఇండస్ట్రీ అంతా ఒక వైపు ఉంటే ఈయన ఒక్కటే ఒక వైపు ఉంటారు. ఎదుటి వారు ఏమనుకున్నా కూడా తను పట్టించుకునే రకం కాదు రాంగోపాల్ వర్మ. తను ఎలా జీవించాలి అనుకుంటారో అలాగే జీవించే రకం వర్మ. ఇక పలు రకాలుగా పలువురు హీరోయిన్ల పై విమర్శలు సైతం కురిపిస్తూ ఉంటాడు. ఇక రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తాజాగా అలనాటి హీరోయిన్ ఇంద్రజ మీద మనసు పారేసుకున్న ట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
తాజాగా వర్మ సడన్ గా బుల్లితెరపై కనిపించారు. కనిపించడమే కాకుండా ఇంద్రజ పై అదోలా చూస్తూ ఉన్న ఒక వీడియో బాగా వైరల్ గా మారుతోంది. ఇక వర్మ ఇప్పుడే కాకుండా గతంలో కూడా నటి జ్యోతి తో కూడా డాన్సులు వేస్తూ చిందులు వేశారు. ఇక అలా ఎంతో ఎంజాయ్ చేశారు వర్మ. ప్రస్తుతం హీరోయిన్ ఇంద్రజ మీద,కన్ను పడడంతో నెట్టింట తన పేరును వైరల్గా మార్చుకున్నారు వర్మ. ఇక తను చూసే చూపులకు ఇంద్రజ చాలా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇక డిసెంబర్ 31వ తారీఖున న్యూ ఇయర్ వెల్కమ్ పలకాలని.. ఈటీవీలో" పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు"అనే ఒక కాన్సెప్ట్ తో ఒక షోని చేయడం జరిగింది.
ఇందులో గెస్ట్ గా రాంగోపాల్ వర్మ రావడం గమనార్హం. ఇక వీరితో పాటే యాంకర్ లాస్య, రష్మీ మరి కొందరితో కలిసి డాన్స్ వేయడం జరుగుతుంది. ఈ షో ఈ నెల 31వ తేదీన టెలికాస్ట్ కానుంది. వర్మ ఈ వీడియో లోనే మీ అందర్నీ నేను పెళ్లి చేసుకుంటా అంటూ రేచ్చిపోయారు.అలా అనడంతో వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. చివరిలో ఇక సమంత నటించిన ఐటెం సాంగ్ బ్యాగ్రౌండ్ వేయడంతో ఇంద్రజ వైపు చాలా కసిగా చూశారు వర్మ. వీడియో ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: