టీవీ: గుప్పెడంత మనసు వసుధార రియల్ లైఫ్ స్టోరీ..!

Divya
గత పది సంవత్సరాల నుండి బుల్లితెరపై పలు చానల్స్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీరియల్స్ లో నటించే ఎంతో మంది నటీమణులు, తన అందంతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ వస్తున్నారు. ఇకపోతే స్టార్ మా ఛానల్ లో తాజాగా ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. సీరియల్ లో నటిస్తున్న ప్రతి నటీనటులు తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఈ సీరియల్ ద్వారా ఎంతోమంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఇకపోతే గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న వసుధారా అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులగా మార్చుకుంది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న వసుధార అసలు పేరు రక్షా గౌడ. వసుధార కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి.  కన్నడ అమ్మాయి అయిన వసుదారా బెంగళూరులో ఫిబ్రవరి 17 న జన్మించింది. జైన్ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కి కంప్లీట్ చేసింది.
ఇక చిన్నప్పటినుంచి మోడల్ అవ్వాలని కోరుకుని  అనుకున్న విధంగానే విజయవంతమైన మోడల్ గా రాణించింది. చదువు పూర్తవగానే మొదట సీరియల్స్ కంటే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది వసుధారా. మోడల్ గా తన కెరియర్ ను కొనసాగించి ఒకపక్క మోడలింగ్ చేస్తూ మరో పక్క రాధా రమణ అనే ఒక కన్నడ సీరియల్ లో కూడా నటించింది. తర్వాత పుత్మల్లి  అనే మరొక సీరియల్ లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ రెండు సీరియల్స్ కూడా కన్నడలో మంచి పేరు తెచ్చుకోవడంతో ఈమెకు కన్నడ ఇండస్ట్రీ లో సూపర్  క్రేజ్ వచ్చింది. మొదటిసారి కృష్ణవేణి అనే సీరియల్ ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: