బిగ్ బాస్ 5: సిరిపై తన ప్రేమను బయటపెట్టిన శ్రీ రామ్...

VAMSI
నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ మొత్తం కోలాహలంతో నిండిపోయింది. ఫన్నీ టాస్క్ లు ఇచ్చి పర్ఫార్మెన్స్ చేయమన్నాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులు ఏమైనా తక్కువతిన్నారా ఇచ్చిపడేసారు అంతే. ఇంతకీ ఆ టాస్క్ లు ఏమిటంటే..ఇంటి సభ్యులకు రోల్ ప్లే టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. అంటే ఒకరు పాత్రను మరొకరు తీసుకుని వారిలా యాక్ట్ చేసి ఎంటర్టైన్ చేయాలన్నమాట. కాగా హౌజ్మేట్స్ అంతా ఇచ్చిన పాత్రల కోసం రెడీ అయ్యి వారి ఫేస్ షీల్డ్స్ ను మెడలో వేసుకున్నారు. ఇక టాస్క్ మొదలయినప్పటి నుండి నవ్వులే నవ్వులు. మొత్తం ఈ టాస్క్ అంత కూడా వన్ మ్యాన్ షో లా దద్దరిల్లేలా పర్ఫామెన్స్ ఇస్తూ కామెడీని పండించాడు సన్ని.
అయితే సన్ని కి ప్రియాంక రోల్ చేయమని, కాజల్ కి మానస్ రోల్ చేయమని రాగా..ఫుల్ గా అమ్మాయిలా రెడీ అయిన సన్నిని చూసి ఇపుడు ఈ మానస్ వందసార్లు పింకీ కి ఐ లవ్ యు చెబుతాడు అనగా, మానస్ వచ్చి అసలు నేను ఆ మాట ఎప్పుడన్నాను. మీరు నా క్యారెక్టర్ చేస్తూ ఇలా అంటే ..జనాలు నా గురించి ఏమనుకుంటారు అంటూ ఫైర్ అయ్యాడు. మద్యలో సన్ని చెప్పినా వినకుండా తనని కూడా కసురుకున్నాడు. అలా సన్ని, మానస్ ల మధ్య గొడవకు పరోక్షంగా కారణమయ్యింది పింకీ. అయితే చాలాసేపటికి కూల్ అయ్యి ఆ తర్వాత టాస్క్ లో మాత్రం సన్ని ఓ రేంజ్ లో నవ్వుల వర్షం కురిపించాడు. మొదట షణ్ముఖ్ గా ఆ తరవాత మానస్ పాత్రలో వామ్మో కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు సన్ని.
ఇక ఆ తరవాత చూస్తే సిరి రోల్ శ్రీ రామ్, అలాగే రామ్ రోల్ సిరి లు వేశారు. ఒకానొక సమయం లో సిరి క్యారెక్టర్ లో ఉన్న రామ్...నాకు శ్రీ రామ్ పై చాలా ప్రేమ ఉంది చెప్పానా ఏంటి అంటూ సిరికి షాక్ ఇచ్చాడు. అయితే ఇది చూసిన వారికి చాలామందికి ఎలా అనిపించింది అంటే అవకాశం రావడంతో..  సిరిపై తనలోని ప్రేమను బయట పెట్టాడు  శ్రీ రామ్ అని.
మొత్తానికి టాస్క్ మాత్రం చాలా బాగా వచ్చింది. నిన్నటి ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ హ్యాపీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: