టీవీ: నా పేరు మీనాక్షి ఫేమ్ గోయల్ రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ ఆడియన్స్ ని బాగా కట్టిపడేస్తుంది. ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా ఈ సీరియల్లో అగర్వాల్ కు అక్క పాత్రలో కణిక గోయల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కూడా ఈ సీరియల్ లో నెగటివ్ పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. గోయల్ అందం , అభినయంతో పాటు చాలా చక్కగా ఉండడం చూసి ప్రతి ఒక్కరూ ఈమెకు అభిమానులుగా మారుతున్నారు.
గోయల్ అసలు పేరు తనీషా కుప్పన్న. ఆగస్టు 10వ తేదీన జన్మించిన తనీషా కర్ణాటక రాష్ట్రంలోని కొడవ లో జన్మించారు. ప్రస్తుతం తనీషా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో నివసిస్తోంది. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి.. ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే బీబీఏ తనీషా పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి తనీషా కి యాక్టింగ్ మీద బాగా ఇష్టం ఉండడంతో ఎన్నో కలలు కన్నారు. తనీషా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే మోడల్ రంగంలో బాగా పేరు తెచ్చుకోవాలని ఆలోచించి, మొదటగా మోడలింగ్ రంగంలోకి అడుగు వేసింది.
ఇక మోడలింగ్ లో మంచి పేరు సంపాదించుకున్న తనీషా, ఆ తర్వాత తమిళ్, కన్నడ సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు, సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. తనీషా కేవలం ఆర్టిస్ట్గానే కాకుండా యాంకర్ గా కూడా పని చేశారు. చెర్రీ ,శాస్త్ర ,గోకుల కృష్ణ, కారణ, పారిజాత ఇలా మరి కొన్ని సినిమాలలో తనీషా  నటించింది. సీరియల్ విషయానికి వస్తే లక్ష్మీ స్టోర్స్, పుట్టమల్లి, దుర్గ, నీలి, మాయ, సాక్షి ,సరయు, అశ్విని నక్షత్ర  పలు సీరియల్స్ లో ఈమె నటించింది. కన్నడ లో మంగళ గౌరీ మధువే సీరియల్ తో పాటు  తెలుగులో నా పేరు మీనాక్షి సీరియల్స్ లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: