టీవీ: నా పేరు మీనాక్షి సీరియల్ శాండీ రియల్ లైఫ్ స్టోరీ..!!
అసలు పేరు ప్రిన్సియావర్.. ఇక శాండీ ని అందరూ ముద్దుగా యావర్ అని పిలుస్తూ ఉంటారు.. జూలై 12 వ తేదీన పంజాబ్ లో శాండీ జన్మించారు. ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఇక చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి ఉన్న శాండీ ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని మొదట మోడలింగ్ నేర్చుకున్నాడు. తన కెరీర్ను ప్రారంభించిన మొదట్లో కొన్ని ప్రకటనలలో నటించే అవకాశం వచ్చింది. లఘు చిత్రాలలో నటించిన శాండీ మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి అక్కడ కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్నారు.
2 సంవత్సరాల పాటు జిమ్లో బాగా వర్కౌట్ చేసి తన శరీరాన్ని సిక్స్ ప్యాక్ గా మార్చుకున్నాడు. ఇక చూడడానికి బాలీవుడ్ హీరోల మనకు కనిపిస్తాడు శాండీ. తెలుగు సూపర్ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ తో కూడా ఒక సినిమాలో ఒక చిన్న పాత్రలో కలిసి నటించాడు. ఇప్పుడు ప్రస్తుతం నా పేరు మీనాక్షి సీరియల్ లో నెగిటివ్ పాత్ర పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నాడు శాండీ. ఇక షూటింగ్ సమయంలో జోక్ లు వేస్తూ మిగతా సీరియల్ నటీనటులతో చాలా సరదాగా సమయాన్ని గడిపేస్తుంటాడు. ఇతను కమిట్మెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక త్వరలో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరికతో ఇప్పటి నుంచి చిన్న చిన్న పాత్రను చేస్తున్నాడు శాండీ.