బిగ్ బాస్ 5: షణ్ముఖ్ లవర్ 'దీప్తి' బాగా హర్ట్ అయిందా?

VAMSI
బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి, షన్నులు చాలా క్లోజ్ అయిన విషయం తెలిసిందే. వీరు హౌజ్ లో చేస్తున్న రొమాన్స్ గురించి బయట జనాలు కోడై కూస్తున్నారు. ఎమోషన్ ఏదైనా వీరి మధ్య హగ్గులు ఖాయం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరు హౌజ్ లో ఎలా ఉంటున్నారు అనేది వారి వారి ఫ్యామిలీస్ కూడా చూస్తూనే ఉంటాయి. కాగా మొన్న, నిన్న బిగ్ బాస్ హౌజ్ లోకి ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మొన్న బిగ్ బాస్ హౌజ్ లోకి సిరి తల్లి రాగా...ఆమె షన్నుతో మితిమీరుతున్న వారి హగ్గుల గురించి కామెంట్ చేసింది.
దాంతో షన్ను చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సిరి అయితే ఆ మాటలు పట్టించుకోవద్దు అని చెప్పకనే చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. మరి నిన్నటి ఎపిసోడ్ లో షన్ను మదర్ రాగా ఆమె కూడా షన్నుకి నువ్వు ఆట బాగానే ఆడుతున్నావ్ ఒక్కరితోనే క్లోజ్ గా ఉండకు... మిగిలిన వారంతా కూడా ఎంత మంచి వాళ్ళు అందరితో సరదాగా ఉండు నేను చెప్పేది నీకు అర్థం అయి ఉంటుంది అంటూ చెప్పింది. దీప్తి సునైనా గేమ్ గురించి ఏమంటుంది అని షన్ను అడుగగా తను కూడా నాలానే ఆలోచిస్తుంది అంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఇక సిరి మాట్లాడుతూ గేమ్ పైన ఫోకస్ పెట్టు అంటూ... తన కొడుకుపైన కాదని చెప్పకనే స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది.
దాంతో ఇద్దరు కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారు. మరి ఇకనైనా ఈ జంట పాములు ఇండివిడ్యువల్  గా గేమ్ ఆడుతారేమో  చూడాలి. ఇక అలాగే రవి వైఫ్, మరియు తన కుమార్తె వియ కూడా వచ్చి హౌజ్ లో సందడి చేశారు. వియ అయితే బిగ్ బాస్ తో క్యూట్ క్యూట్ గా మాట్లాడింది. బిగ్ బాస్ మిమ్మల్ని ఒక్కసారి చూడాలి అంటూ హౌజ్ మొత్తం వెతికేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: