టీవీ: ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ రాశి రియల్ లైఫ్ స్టోరీ..!
రాశి అసలు పేరు నీమా సింగ్ రాజ్ పుత్. వరంగల్ జిల్లా నర్సంపేట లో ఫిబ్రవరి 5వ తేదీన జన్మించింది. నీమా సింగ్ మన తెలుగమ్మాయి. నీమా సింగ్ కు ఒక చెల్లెలు కూడా వున్నారు. నీమా సింగ్ కు చిన్నతనం నుంచే నటన ,డ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో చదువుకుంటూనే బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు. నీమా అటు నెగిటివ్ రోల్స్, ఇటు పాజిటివ్ రోల్స్ లో నటించి తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మా టీవీలో ప్రసారమైన పవిత్ర బంధం అనే సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ.
చూడ చక్కని అందం , మంచి హీరోయిన్ కట్ ఔట్ వున్న ఈ ముద్దుగుమ్మను దర్శకులు చూడగానే ఆకర్షితులయ్యారు. ఇక పవిత్ర బంధం సీరియల్ లో ఈమె నటనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా వరుస సీరియల్ అవకాశాలు కూడా రావడం గమనార్హం. ఆడదే ఆధారం, మౌనరాగం, ప్రేమ్ నగర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాదు బీటెక్ అన్ ఒక ఫిలిం లో కూడా ఈమె నటించడం గమనార్హం. ప్రస్తుతం ఈమె జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూర్యకాంతం అనే సీరియల్ లో ప్రవళిక గా నటిస్తోంది.