బిగ్ బాస్ 5: తృటిలో మిస్ అయిన సిరి... కాజల్ ఎలిమినేట్?
కాగా నామినేట్ అయిన వారిలో యాంకర్ రవి, సిరి, కాజల్, మానస్ మరియు సన్నీ ఉన్నారు. ప్రేక్షకుల అంచనాల ప్రకారం సన్నీ మరియు రవి లకు బయట ఫాలోయింగ్ మాములుగా లేదు. కాబట్టి వీరిద్దరూ సేఫ్ అవనున్నారు. మానస్ కూడా తనదైన రీతిలో మైండ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కాబట్టి మానస్ కూడా హౌస్ లోనే ఉంటాడని తెలుస్తోంది. ఇక మిగిలింది కాజల్ మరియు సిరి లు మాత్రమే. వీరిద్దరూ గేమ్ పరంగా స్ట్రాటజీలు బాగానే వాడుతున్నా, ఎక్కడో కాజల్ కొంచెం ఒంటరిగా ఫీలవ్వడం, స్నేహం పేరుతో బలహీనమైపోవడం వంటి కొన్ని కారణాల వలన కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు ప్రచారం విరివిగా జరుగుతోంది.
కాబట్టి ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది మన గల గల కాజల్. ఇంట్లో ఎప్పుడూ తమకు నచ్చని వారిపై గయ్యిమని లేచే కాజల్ అరుపులు వచ్చే సోమవారం నుండి ఇక వినలేమేమో. మరి బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇవ్వనున్నాడా అంది తెలియాలంటే రెండు రోజుల వరకు ఆగాల్సిందే.