తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈటీవీ సీరియల్స్ ఎన్నో ప్రసారమవుతున్నాయి.. అన్న విషయం అందరికీ తెలిసిందే..అందులో ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి సీరియల్ ప్రత్యేకత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీరియల్ లో నటించే ప్రతి నటి, నటుడు కూడా అందం, అభినయంతో నటనతో చాలా చక్కగా నటిస్తున్నారు. ఇందులో జానూ ఫ్రెండ్ గా, జానూ మామయ్య కూతురు గా ఆద్య చాలా చక్కగా నటిస్తోంది. అంతేకాదు ఆద్య ఈమధ్య ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో కెవ్వు కార్తిక్ టీం లో కూడా కనిపిస్తోంది. అయితే ఆద్య ఎవరు..ఆమె ఎక్కడి నుంచి వచ్చింది..? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం..
ఆద్య అసలు పేరు షబీనా.. అక్టోబర్ 8వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ , పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం లో జన్మించింది. షబీనా ని అందరూ ముద్దుగా డింపుల్ బ్యూటీ అని కూడా పిలుస్తుంటారు. షబీనా కు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఇక ఈమె విద్యాభ్యాసం అంతా జంగారెడ్డిగూడెం లోనే సాగింది. డిగ్రీ వరకు పూర్తి చేసిన షబీనా నటన మీద ఆసక్తితో మొదట యాంకర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. అంతేకాదు ఈమె ప్రదీప్ పెళ్లి చూపులు షో లో కూడా పాటిస్పేట్ చేసింది.
షబీనా కు సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశాలు రాక బుల్లితెరపై అడుగులు వేసింది. ఇక ఆ తర్వాత ఈ టీవీలో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షి అనే సీరియల్ ద్వారా బుల్లితెర కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో లో కూడా నటిస్తోంది. జబర్దస్త్ లో షబీనా కు జడ్జ్ ల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి అనే చెప్పాలి. అంతేకాదు షబీనా త్వరలోనే సినిమా అవకాశాలు రావాలనే కారణంతోనే జబర్దస్త్ లోకి వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.