బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 లో రాను రాను ఇంటి సభ్యుల మధ్య ఫైట్ ఎక్కువ అవుతోంది. గత నాలుగు సీజన్ ల లాగే ఈ సీజన్ కూడా మంచి మసాలాతో రసవత్తరంగా సాగుతోంది. అదేనండి ఇప్పటికే 50 రోజులు క్రాస్ చేసిన షోలో ఇంటి సభ్యులు పోటాపోటీగా గేమ్ లో చురుగ్గా అయిపోయారు. వివాదాలు, గొడవలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. మరో వైపు బిగ్ బాస్ ఇచ్చే వైవిధ్యభరితమైన టాస్క్ లు ఇంటి సభ్యుల మధ్య కాక రేపుతున్నాయి. ఆ పోటీల్లో ఎలా అయినా గెలవాలనే ఉద్దేశంతో పోటీపడుతున్న ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు కయ్యానికి దిగుతున్నారు. ఇంతకీ చివరికి బిగ్ సీజన్ 5 విన్నర్ గా మిగిలేదేవరు టైటిల్ గెలిచేది ఎవరు అంటే ఇప్పటికే టాప్ 5 లిస్ట్ గురించి అంతా ఒక అనాలిసిస్ కి వచ్చిన విషయం తెలిసిందే.

 
శ్రీ రామ్ చంద్ర, సన్ని, రవి, యాని మాస్టర్ ఆ తర్వాత చివరలో మానస్ పేరు వినిపిస్తుండగా, ఇపుడు మానస్ మరో మెట్టు ఎక్కి యాని మాస్టర్ స్థానాన్ని ఆక్రమించి టాప్ 4 లో కనిపిస్తున్నాడు. చాలా మంది ఇపుడు మానస్ కు ఫ్యాన్స్ గా మారి పోతున్నారు. గత రెండు వారాల నుండి బిగ్ బాస్ హౌజ్ లో మనోడి పర్ఫార్మెన్స్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి. ఎవరైనా ఏమైనా అంటే అందుకు...ఒకే సరే నీ ఒపీనియన్ అని వదిలేయకుండా ఖచ్చితమైన సమాధానం చెబుతున్నాడు. వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. అది కూడా సున్నితమైన పద్దతిలోనే..ఎదుటి వారి టోన్ పెరుగుతున్నా, మాట కటువుగా ఉంటున్నా..తాను మాత్రం నిదానంగానే  వ్యవహరిస్తున్నాడు. ఇక్కడే మానస్ కి మంచి మార్కులు పడిపోతున్నాయి.


 ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవడానికి ఇంకా అతడు మార్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అంటున్నారు కొందరు విశ్లేషకులు. టాస్క్ ల సమయంలో ఫ్రెండ్షిప్ ని పక్కన పెట్టి, వ్యక్తిగతంగా గేమ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే ప్రియాంకతో కాస్త చనువును తగ్గించుకుంటే మంచిది. హౌజ్ లో ఇంకాస్త యాక్టివ్ గా ఉండాలి అని అంటున్నారు. మరి మానస్ ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు మారుతారా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: