బిగ్ బాస్ 5: ఈ వారం విజె సన్నీ గ్రాఫ్ తగ్గిందా?
ఇక తాను అందరితో మాట్లాడే విధానం, గేమ్ లో చూపించే సీరియస్ నెస్ ఇదంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే సన్నీని టైటిల్ ఫేవరెట్ గా అనుకున్నారు. అయితే ఈ వారం మాత్రం సన్నీ గ్రాఫ్ తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. మాములుగా టాస్క్ ల సమయంలో ఒకరిని ఒకరు అరుచుకోవడం మామూలే. కానీ ఈ సారి అది ఒక స్థాయి దాటి వెళ్ళింది. ముఖ్యంగా జెస్సీ మరియు అని మాస్టర్ లపై వ్యవహరించిన తీరుపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇదే విషయం గురించి నాగార్జున సైతం సన్నీని మందలించాడు. అంతే కాకుండా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో సన్నీని ఈ వారం వరెస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నిక చేశారు.
పై కారణాల వలన ప్రేక్షకుల దృష్టిలో విలన్ గా మారిన సన్నీ గ్రాఫ్ బాగా తగ్గింది. మరి తర్వాత వారం అయినా నాగార్జున చెప్పినట్లు తనను తాను మార్చుకుని ఆటను సాగిస్తాడా లేదా అన్నది చూడాలి. మరియు తన పక్కనే ఉన్న స్నేహితులపై కూడా ఒక కన్ను వేసి ఉండాలి.