బిగ్ బాస్ 5: గ్రూప్ లతో వేడెక్కుతున్న హౌస్ వాతావరణం...
అదే సమయంలో గ్రూప్ గా మాట్లాడుతూ అవతల వారిపై నిప్పు రవ్వలు విసురుతున్నారు. తాజా ఎపిసోడ్ లో రింగ్ లోనుండి బయటకు రాకుండా వారి వారి సంచుల్లోని బాల్స్ ను కాపాడుకోవాలని ఒక టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ టాస్క్ సమయంలో సన్ని, మానస్ లకు శ్రీరామ్ తో పెద్ద యుద్దమే జరిగింది. ఒకానొక సమయంలో ఫిజికల్ కూడా అవ్వబోయారు. గ్రూపులు గ్రూపులుగా వారి వారి స్నేహితులకు సపోర్ట్ చేస్తూ మిగిలిన వారు ఎటాక్ చేయడంతో డోసు చాలా ఎక్కువ అయ్యింది. ఇక అలాగే యాని మాస్టర.. సిరి-షన్ను ల మధ్య కూడా వివాదం చెలరేగగా ఆగ్రహం పీక్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయింతే ఆ వివాదం నిన్న జరిగిన ఎపిసోడ్ లోనూ కంటిన్యూ అయ్యింది.
ఇంటి సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి.. వారి వారి దృష్టిలో వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరు...ఎందుకో చెప్పమని ఆదేశించాడు బిగ్ బాస్. దాంతో ఇంటి సభ్యులు వారి వారి అభిప్రాయాలను చెప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సన్నీకి జెస్సీకి మధ్య వివాదం చెలరేగింది. సన్ని కోపం తాళలేక జెస్సీ మీదకు వెళ్లి పోయాడు. జెస్సీ కూడా ఎక్కడా తగ్గలేదు సన్నీని రెచ్చగొట్టే మాటలతో కౌంటర్ల మీద కౌంటర్లు వేసాడు. ఒకానొక సమయంలో సన్నీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎక్కడ కొట్టేస్తాడు ఏమో అనిపించింది. ఇంటి సభ్యులు మద్యలో కలుగు చేసుకుని వీరిని శాంత పరచడంతో గొడవ సద్దుమణిగింది.