బిగ్ బాస్ 5: "గలగల" కాజల్ కు ఏమైంది... ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యి ఇప్పటికీ ఏడు వారాలు గడిచింది. షో ప్రారంభ సమయంలో మరియు ఇప్పటికీ చూస్తే ఇంటి సభ్యుల్లో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాలి. మొదట్లో ఒకటి రెండు వారాలు బాగా బ్యాలెన్సింగ్ ఆడిన కొందరు కంటెస్టెంట్స్ రోజులు గడిచే కొద్దీ వారి రియాలిటీని బయటకు తీసుకొచ్చారు. ఎంత మంచిగా ఉండాలి, సర్దుకుపోవాలి అన్నా వారి వల్ల కావడం లేదు. అలాగే గేమ్ ప్లాన్ తో వచ్చారు, ఫుల్ స్ట్రాటజీతో వచ్చారు అంటూ అనుకున్న వారేమో ఢీలా పడిపోతున్నారు. ఇలా హౌజ్ లో చాలా వింతలు, అలాగే స్నేహ బంధాలు అన్ని సందర్భానుసారంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా మార్పు అనే విషయానికి వస్తే ఆర్జే కాజల్ గురించే ముందుగా చెప్పు కావాల్సి ఉంటుంది.
బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభంలో ఉన్న కాజల్ కి ఇపుడు ఉన్న కాజల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో ఫటా ఫట్ దనా దన్ అనేలా ఉండే కాజల్ ఇపుడు బాగా డల్ అయిపోయింది.  ఇతరుల నుండి చిన్న వ్యతిరేకతను కూడా తీసుకోలేక పోతోంది. ఎవరైనా తనతో కాస్త గట్టిగా మాట్లాడితే గంగా నదిలా పొంగిపోతుంది, ఫుల్ ఎమోషన్ అయిపోతుంది కాజల్. అసలు ఇంతలా ఎందుకు మారిపోయింది అన్నది అస్సలు ఎవరికి అర్దం కావడం లేదు. కాజల్ అంటే ప్రతి ఒక్కరూ గేమ్ స్ట్రాటజీ ఫుల్ గా ఉందని..మొదటి నాలుగు సీజన్ లని బాగా చూసి గేమ్ కి వచ్చిందని అనేవారు, అలాంటిది ఇపుడు చాలా మారిపోయింది.
ముఖ్యంగా కాజల్ గేమ్ లో 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. ఎప్పుడూ ఒకరిపై ఆధారపడుతూనే ఉంది. పైగా తనకు మొదటి నుండి ఉండే చేదు లక్షణం ఒకరి మాటలు ఇంకొకరితో చెప్పడం, దీనితో అందరికీ శత్రువులా మారిపోయింది. ఇక మిగిలింది ఏడూ వారాలు మాత్రమే. ఇకనైనా గ్రూప్ గేమ్స్ ఆపేసి ఒంటరిగా ఆడితే ఫలితం ఉంటుంది లేదంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: