బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ లో ట్విస్ట్... చివరికి?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా మా టీవీలో ప్రసారం అవుతూ ఉంది. రేటింగ్ పరంగా మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత మెల్ల మెల్లగా రేటింగ్ లో మంచి ఊపుతో ముందుకు వెళుతోంది. ఈ వారం ఎలిమినేషన్ కు 8 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ ఎనిమిది మంది నుండి నిన్న నాగార్జున హౌజ్ లోకి వచ్చి శ్రీరామ్ మరియు కాజల్ లను సేవ్ చేశారు. అయితే ఇక 6 మంది సభ్యులలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అని మిగిలిన ఇంటి సభ్యులు ఎంతో టెన్షన్ లో ఉన్నారు. అయితే ఎప్పటి లాగే మనకు లీకులు ప్రకారం ఎలిమినేషన్ లో చాలా ఉత్కంఠ చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఎప్పటి లాగే సోషల్ మీడియాలో తన కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన అందరి కన్నా ఎక్కువ ఓట్లతో  యాంకర్ రవి ముందంజ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇలా ఎలిమినేషన్ నుండి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ ప్రియ మరియు యాని మాస్టర్ ల వద్ద ఆగుతుందట. మొదటి నుండి ప్రియ వివాదాలతో ఎక్కువగా హైలైట్ అయ్యారు. ఈ వారం కూడా  ప్రియ సన్నీతో ఎంత గొడవ పెట్టుకుంది అనేది ప్రేక్షకులు చూసి విసిగి పోయారని తెలుస్తోంది. అందుకే చివరి నిముషంలో యాని మాస్టర్ సేవ్ అయ్యి ప్రియ హౌజ్ నుండి ఎలిమినేట్ అవబోతోంది.
ఇది కొంత మంది ప్రేక్షకులకు షాక్ గా ఉండవచ్చు. కానీ ప్రియని భరించ లేక బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది. మరి నిజంగా ప్రియనే ఎలిమినేట్ కానుందా అసలు ఏమి జరిగింది అన్న విషయాలు తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.  కానీ అపుడప్పుడు బిగ్ బాస్ కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: