బిగ్ బాస్ 5: సిరి కెరీర్ కి ఈ షో ప్లస్ అవుతుందా?
అయితే ఈసారి కూడా ఎలిమినేట్ అయ్యేది లేడీ కంటెస్టెంట్ అంటూ ప్రచారం జరుగుతోంది. అది ఎవరూ అనే విషయానికి వస్తే కానీ మాస్టర్ లేదా ప్రియా పేర్లు వినపడుతున్నాయి. మొదటి రెండు మూడు వారాలు సిరి ఎలిమినేట్ అవబోతుంది అంటూ పేరు గట్టిగా వినిపించగా, ఇపుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లిస్టులో చేరిపోయింది. సిరికి ముందు నుండే పాపులారిటీ ఉండటం కొంచం ప్లస్ అయితే..ఇపుడు బిగ్ బాస్ షో కి గ్లామర్ ప్లస్ గా ఉండటం హౌజ్ లో షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండటంతో సిరి క్రేజ్ బయట అలా అలా పెరిగిపోయింది. టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ అమ్మడు బయటకు రావడం లేటు వరుస అవకాశాలు చూస్తున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లను చూసుకుంటే ఎవ్వరికీ పెద్దగా అవకాశాలు వచ్చి బాగా సెటిల్ అయినట్లు దాఖలాలు లేవు. కానీ ఈ బిగ్ బాస్ షో సిరి కెరియర్ కి స్పీడ్ పెంచేసిందంటు అంటున్నారు. ఇది నిజమవ్వాలని అంతా కోరుకుందాం.