బిగ్ బాస్ 5: ఆవేశమే ఆమె పాలిట శాపమవుతుందా?
అదీకాక ఊహకందని కంటెస్టెంట్ ల ఎలిమినేషన్ తో ఆడియన్స్ కి షాక్ ఇస్తున్నారు బిగ్ బాస్. ఈసారి నామినేషన్ బరిలోకి యానీ మాస్టర్, కాజల్, శ్రీరామ్, రవి, జెస్సీ, సిరి, ప్రియ మొత్తం ఏడుమంది ఇంటి సభ్యులు చేరుకున్నారు.
ఇక ఈసారి హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే ఎక్కువగా యాని మాస్టర్ పేరు వినిపిస్తోంది. మొదట్లో అందరితో ఎంతో ఆనందంగా కనిపించిన ఈమె ఇపుడు రానురాను బీటలు వారుతోంది. తనకి కోపం వస్తే ఎపుడు ఎవరితో ఎలా రియాక్ట్ అవుతుందో ఆమెకే అర్దం కావడం లేదు. మొన్నటికి మొన్న మొదటి నుండి తన కూతురిగా భావించిన శ్వేత ను ఒకానొక సందర్భంలో నువ్వు నన్ను అమ్మ అని పిలవకు తొక్కలో రిలేషన్స్ నాకు అవసరం లేదు అంటూ ఆగ్రహం తో ఊగిపోయి అందరి ముందు బ్యాడ్ అయ్యింది.
విశ్వ ను కూడ నన్ను అక్క అని పిలవకు అంటూ ఫైర్ అయ్యింది ఇలా తనని తానే బ్యాడ్ చేసుకుంటూ వస్తోంది. ఇపుడే టోటల్ ఫోకస్ సిరిపై పెట్టి టార్గెట్ చేసి మరీ కామెంట్ చేస్తోంది. మరో వైపు ప్రియ కూడా సన్ని ని ఉద్దేశించి విచిత్ర మైన ఎక్స్ప్రెషన్స్ తో... హు హా నేను చేస్తా..ఎవరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాళ్లు విసురుతోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తోంది. మరి ఇప్పటికే లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ఎక్కువ కాగా ఈసారి ఏమైనా ఆ పరంపరను మారుస్తారేమో చూడాలి.