బిగ్ బాస్ 5: యాంకర్ రవితో గొడవ పడ్డారా... ఇక ఇంటికే?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 రోజు రోజుకీ ఉత్కంఠను పెంచుతూ హై రేటింగ్ తో బుల్లి తెరపై తన సత్తా చాటుతున్న ఒక రియాలిటీ షో. ఈ షో లో ప్రతి రోజూ స్పెషలే. ఎందుకంటే ఎప్పుడు ఎవరెవరు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో తెలియదు. అలాగే ఎవరు ఎవరిపై విరుచుకుపడతారో అర్దం కాదు. ఏదో ఒక విధంగా ప్రజలకు పక్కా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని చెప్పొచ్చు. సోమ, శని, ఆదివారాలు మరీ స్పెషల్ అనే చెప్పాలి. సోమవారం అయితే హౌస్ నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇంటి సభ్యులు వారిలో వారికి రీజన్స్ చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు బాగానే ఉన్నా కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియ రోజు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ మాస్క్ లేని ఫేస్ ని బయటపెడతారు. ఇక శనివారం అయితే నాగ్ స్టేజ్ పై సందడి చేస్తూ సభ్యుల తప్పులు అడ్రస్ చేస్తూ దుమ్ములేపుతారన్న విషయం తెలిసిందే. 

అంతేకాదు నామినేట్ అయిన వారిలో ఎవరు అన్న విషయం ఒక్కొక్కరిగా చేస్తారు. ఇక ఆదివారం హౌస్ నుండి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారు నాగ్. అయితే ఈ ఆదివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యే సభ్యురాలు శ్వేతా వర్మ అని సమాచారం. నిన్న మొన్నటి వరకు తనేంటో తన పనేమిటో అన్నట్లుగా ఉన్న శ్వేత ఇప్పుడు గత రెండు వారాల నుండి ఇంటి సభ్యులపై ఒక రకమైన అథారిటీ చూపిస్తున్నట్టు అందరూ ఫీలవుతున్నారు. చిన్న విషయానికి కూడా ఎక్కువగా కోప్పడుతూ  యాంగ్రీ బర్డ్ గా పేరు తెచ్చుకున్న ఈమె రవి కారణంగానే ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు.

రవి మరియు శ్వేత వర్మ మధ్య టెడ్డి కాటన్ల విషయంలో ఒక వివాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే లాస్ట్ టైం రవి లహరి ఇలా తర్వాత లహరి బయటకు వచ్చేసిన అయితే ఈసారి శ్వేతా రవి ల ఇష్యు తర్వాత శ్వేతా బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తుంది అని తెలుస్తోంది. ఏదేమైనా రవితో పెట్టుకుంటే ఇక హౌస్ నుండి అవుట్ అనే విషయాన్ని ఇక్కడ మరోసారి ప్రూవ్ అయింది. తప్పు ఎవరిదైనా బయటకు వచ్చేది మాత్రం రవి ఆపోజిటర్ అవడం గమనార్హం. మరి ఈ వారం కూడా ఇది నిజం అవుతుందా అన్నది. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: