బిగ్ బాస్ 5: "షణ్ముఖ్ - సిరి"ది ప్రేమాయణమేనా?

VAMSI
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో  లో రోజురోజుకీ సిరి శృతిమించుతోంది. అసలు ఈ అమ్మాయి చేసే పనులు చూస్తుంటే తెలుగు ప్రజలకు కంపరం పుడుతోంది. మరి ఏంటండీ అంత పెద్ద బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్  జస్వంత్  బెడ్ పై తప్ప ఇంకెక్కడ తనకి చోటు లేనట్టు..తనకోసం ఒక చిన్న బెడ్ కూడా హౌజ్ లో ఖాళీగా లేనట్టు ఈ అమ్మాయి పోయి పోయి ఆ షణ్ముఖ్, జస్వంత్ బెడ్ పైనే పడుకోవడం అదీ షణ్ముఖ పక్కనే పవలించడం. ఇక మరీ షణ్ముఖ్ బెడ్ షీట్ నే షేర్ చేసుకోవడం బాబోయ్ ఇవి చూడటానికి కొందరు అసహ్యించుకుంటున్నారు. ఇంకొందరు ఫాస్ట్ జనరేషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు. మరి కొందరు ఒకవేళ కొందరు అభిప్రాయ పడుతున్నట్లు బిగ్ బాస్ లో జరిగేవన్నీ కల్పితాలు స్క్రిప్ట్ ప్రకారమే అయినా ఇది నేషనల్ టెలివిజన్ షో ప్రజలంతా చూస్తున్నారు. 

అలాంటిది.. తనను తాను ఎలా తగ్గించుకోగలదు అంటూ సిరిని తిట్టిపోస్తున్నారు కొందరు నెటిజన్లు. అందులోనూ ఈ సిరి అర్థరాత్రులు వరకు షన్ముఖ్ తో ముచ్చట్లు పెట్టుకోవడం అందులోనూ ఒకే బెడ్ షీట్ ను షేర్ చేసుకోవడం....ఈ దృశ్యాలు మేము చూడలేము బిగ్ బాస్ కాస్త ఎడిట్ చేయండి అంటున్నారు కొందరు. అటు శ్రీ రామ్ చంద్ర, హమీదా లపై కూడా వారి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని క్లియర్ గా అర్థం అవుతోంది. కానీ వాళ్ళు మరి ఇంత చనువుగా ఉండటం చూడలేదు. మరో వైపు షన్ముఖ్ ఏమో సందర్భం వచ్చినప్పుడల్లా  దీప్తి మాత్రమే నా లోకం అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటాడు.

మరి సిరి  తనతో అంత క్లోజ్ గా ఉంటున్నా ఎందుకు దూరం పెట్టట్లేదో ప్రేక్షకులకు అర్దం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. మరి దీప్తమ్మ ఈ షో చూసి షన్ను ని బయటకు రాగానే ఏం చేస్తుందో ఏమో, ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ లలో 4 సీజన్లు జరిగాయి. ప్రతి సీజన్ లోనూ గాఢ ప్రేమికులను ఎందరినో చూశాం..వారి మధ్య రొమాన్స్ డోస్ కూడా శృతిమించడం చూశాం. అయితే వాటితో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 5 చాలా పద్ధతిగా నడుస్తోందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: