బిగ్ బాస్ 5: లోబో కాజల్ కు "మిడిల్ ఫింగర్" చూపించాల్సింది కాదు...

VAMSI
కరోనా పీరియడ్ లో ఏమి పాలుపోక ఏ ఎంటటైన్మెంట్ లేక ఎంతగానో నలిగిపోయిన ప్రజలకు తిరిగి మనశ్శాంతిని ప్రసాదించేందుకు ఓ వైపు థియేటర్ లో సినిమాల సందడి మొదలైతే.. మరో వైపు బుల్లితెరపై బిగ్ బాస్ కోలాహలం షురూ అయింది. ఇక అప్పటినుండి ప్రతి ఇంట బిగ్ బాస్ షో మాటలే వినబడుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో కాస్త గందరగోళం చోటు చేసుకుంది. లోబో చేసిన పనికి ఈ సారి శనివారం బిగ్ బాస్ స్టేజ్ పై కింగ్ నాగార్జున ఏ రేంజ్ లో లోబో కి షంటింగ్ ఇస్తాడో ఊహించడం కష్టమే. మరి లోబో చేసిన పని అలాంటిది మరీ. నిన్నటి ఎపిసోడ్ లో అసలు ఏమి జరిగింది అంటే లోబో, రవి లు ఇద్దరు కూర్చుని మాట్లాడుతుండగా మధ్యాహ్నం కాజల్ వచ్చి మీకు బాగా అయింది రవి లేకపోతే కిచెన్ డిపార్ట్మెంట్లోకి రావాల్సిందే మంచి పని అయింది అంటూ కాస్త వెక్కిరించినట్లు మాట్లాడుతుండగా లోబోకి కోపం వచ్చి మిడిల్ ఫింగర్ ని చూపించాడు. అయితే దాన్ని సరిగా ఎవరు గమనించలేదు.
కానీ కాజల్ మాత్రం చూసి చాలా సీరియస్ అయింది. ఏంటి లోబో నేను మాట్లాడుతుంటే నాకు రెస్పాండ్ అయ్యే పద్ధతి ఇదేనా..?? ఎక్స్ట్రాలు చేయకు ఏమనుకుంటున్నావ్ నువ్వు మెంటల్ ఏలు చూపెట్టడం నేను చూశాను అంటూ మండిపడింది. కావాలంటే చెప్పు ఫుటేజ్ చూపిస్తాను అసలు ఎలా అలా చేస్తామంటూ తమ ఆగ్రహాన్ని కనబరిచింది. అలా మాట్లాడుతుండగా రవి మధ్యలో వచ్చి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు ఇంతకుముందు ఏమన్నావ్ నేను కిచెన్ రూమ్ లోకి రానా పని చేయనా నువ్వు చూసావా?
నీకు తెలుసా అంటూ తను కూడా కాజల్ పై బాగానే సీరియస్ అయ్యాడు. దాంతో హౌజ్ మొత్తం అట్మాస్పియర్ హాట్ గా మారిపోయింది. మరో వైపు ప్రియాంక ఈ విషయంపై లోబోపై సీరియస్ అయింది సిరితో మాట్లాడుతూ.. నాకే కనుక అలా మిడిల్ సింగర్ చూపించి ఉంటే కట్ చేసి ఉండేదాన్ని...అంటూ అంతే కాదు లోబో మిడిల్ ఫింగర్ చూపించింది నిజమని అది తప్పేనని శ్రీరామ్ తో చెప్పాడు రవి. మరి ఈ విషయంపై  సాటర్డే నాగ్ లోబోపై ఎలా ఫైర్ అవుతాడో చూడాలి. మరోవైపు ఏదేమైనా తప్పు ఎవరిదైనా ఒక ఆడపిల్లతో అలా ప్రవర్తించడం సరికాదంటూ సోషల్ మీడియాలో లోబో పై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: