బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

VAMSI
బిగ్ బాస్ హౌజ్ సీజన్ 5 లో అప్పుడే నాలుగు వారాలు గడచిపోయి ఐదవ వారం లోకి అడుగుపెట్టింది. ఆదివారం నట్ రాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడంతో మొత్తం ఇప్పటి వరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమాదేవి, లహరి ఇలా ముగ్గురు మహిళలు వరుసగా ఎలిమినేట్ అవ్వగా నాలుగో ఎలిమినేషన్ లో ఆ లెక్క కాస్త మారి నట్ రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే ఇక ప్రత్యేకంగా చెప్పాలా...అసలే శనివారం, ఆదివారం వచ్చిందంటే ఓ వైపు నాగ్ సందడి ఉన్నా..మరో వైపు ఎవరు సేవ్ అవుతారు...ఎవరు ఎలిమినేట్ అవుతారన్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఇక సోమవారం అంటే ఆ ఎలిమినేషన్ కు బీజం పడేదే ఈ రోజు. హౌజ్ లోని ఇంటి సభ్యులు ఎవరినైతే నామినేట్ చేస్తారో వారంతా వచ్చి నామినేషన్ బుట్టలో పడతారు.
ఇంకేముంది బాల్ ఇప్పుడు ప్రజల కోర్టు లో పడుతుంది. అలా వారికి ఓటింగ్ జరిగి తక్కువ ఓటింగ్ వచ్చిన వారిని నాగ్ ఆదివారం ఎలిమినేట్ చేస్తారు. కొందరు ప్రజల ఓటింగ్ కి ఎలిమినేషన్ కి సంబందమే లేదు. హౌజ్ లో పర్ఫార్మెన్స్ ను బట్టి బిగ్ బాస్ యాజమాన్యమే ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటుంది అని కొందరు అంటుంటారు. మరి కొందరు ప్రజల ఓటింగ్ ప్రకారమే నామినేషన్ జరుగుతుందని అంటుంటారు. ఈ విషయం అలా ఉంచితే సోమవారం వచ్చిందంటే చాలు ఈ నామినేషన్ ప్రక్రియ వలన ఇంటి సభ్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అప్పుడు ఇంటి సభ్యులు అసలు రంగులు బయటపడతాయి.
కొందరు ఇంటింసభ్యులైతే ఎందుకు నామినేట్ చేస్తున్నారే వారికే తెలియదు. ఏదో కారణం సేఫ్ గా చెప్పి నామినేట్ చేసేస్తారు. ఇక నిన్నటి ఎపిసోడ్ అలాగే నామినేషన్ ప్రక్రియ జరిగింది.  లోబో, సిరి, షణ్ముఖ్, జస్వంత్, ప్రియ, మానస్, సన్ని, హమిద, విశ్వ, జస్వంత్ లు నామినేషన్ లో ఉన్నారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. అయితే అందరూ అనుకుంటున్నట్టు సభ్యులకు వచ్చిన ఓట్లను బట్టి ఎలిమినేషన్ చేస్తున్నారా లేదా యాజమాన్యమే సొంతంగా ఒక నిర్ణయానికి వస్తుందా అన్నది ఇంకా ప్రజలలో ఒక అనుమానం ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: