బిగ్ బాస్ షో లో "చై - సామ్" ల విడాకుల కలవరం ?
వీరందరూ కూడా హౌజ్ లో కాస్త ఎక్కువగా మనకు కనిపించిన వారే...అంటే మిగిలిన ఇంటి సభ్యులతో తరచూ కీచులాడటమో, వారిపై పెట్టనం చూపించాలి అనుకోవడం ఇలాంటి లక్షణాలు కాస్త ఎక్కువ కనిపించి అవి కూడా మనల్ని బాగా ఎంటర్ టైన్ చేసిన అంశాలే. వీరు అందరితో కలిసిపోయి సరదాగా ఉన్న రోజులు ఉన్నాయి. ముఖ్యంగా నట్ రాజ్ మాస్టర్ ఇతరులపై ఆయనకి కోపం వచ్చినప్పుడు ...ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే సమయంలో చెప్పే సినిమా డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి...కొందరు చూసే వారికి మాత్రం సిల్లీగా నవ్వు తెప్పించాయి. అలాగే ఈయన పర్ఫార్మెన్స్ అంటే ఇష్టపడేవారు ఉన్నారు. మొన్న జరిగిన వెయిట్ లాస్ టాస్క్ లో నట్ రాజ్ మాస్టర్ బెస్ట్ ఇవ్వడానికి ఎంతగా కష్టపడ్డాడో చివరి వరకు ప్రయత్నించారో తెలిసిందే. ఇలా అందరిలోనూ కొన్ని మైనస్ లు అలాగే కొన్ని ప్లస్ లు ఉన్నాయి కాకపోతే కాస్త ఎక్కువ తక్కువ... అంతే.
ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే అందరూ ముందుగా ఊహించినట్టే..మీడియాలో గత రెండు మూడు రోజుల నుండి ప్రచారమౌతునట్టే నట్ రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ యాజమాన్యం వారు ఈ లీకులు బయటకు రాకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న జాగ్రత్త పడుతున్నా ఎలా వస్తున్నాయో కానీ బిగ్ బాస్ హౌజ్ న్యూస్ లు ముందుగానే బయటకు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చేస్తుంది. దీని వల్ల ప్రేక్షకుల్లో ఎంతో కొంత ఆసక్తి కూడా తగ్గుతోంది అయినా వేరే ఆప్షన్ లేదు అన్నట్టు జనాలు బిగ్ బాస్ షో కి అలవాటు పడిపోయారు. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
ఇక ఈ శని ఆది వారాల్లో కింగ్ నాగ్ ఎప్పటిలాగే సందడి చేశారు కానీ ఆయన్ని స్టేజ్ పై చూసిన ప్రతి ఒక్కరికి చైతు, సామ్ ల విడాకుల విషయమే గుర్తొచ్చి మనసులో తెలియని ఒక బాదని నిరాశ కలుగచేసింది. నెలపై నుండే వీరి విడాకుల విషయంపై వార్తలు వస్తున్నా ప్రతి ప్రేక్షకుడు ఆ వార్తలు చివరికి ఒట్టి మాటలే అని తేలాలని చైతు, సామ్ లు మేము బాగానే కలిసి ఉన్నాం అన్న శుభవార్త చెప్పాలని ఎంతగానో ఆశించారు...కానీ అనూహ్యంగా వీరు మేం విడిపోతున్నాం అని చెప్పి అందరినీ పరోక్షంగా ఎంతగానో బాదించారు. అలా బిగా బాస్ షోలో నాగ చైతన్య , సమంత ల విడాకుల విషయం గుర్తొచ్చేలా చేసి ప్రేక్షకుల మదిని కలవర పెట్టింది.