బిగ్ బాస్ 5: "సిరి - షణ్ముఖ్" లు వచ్చింది గేమ్ కోసమేనా?

VAMSI
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యి అప్పుడే మూడు వారాలు అయిపోయింది. ఉమాదేవి, సరయు, లహరి
ముగ్గురు ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయారు. సీజన్ 5 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో గేమ్ ప్లే చేస్తూ ఇంట్లో సందడి చేస్తున్నారు. ఇక ఇక్కడ ఈసారి శ్రీ రామ్ చంద్ర, హమీదాలు లవ్ కపుల్ గా కలరింగ్ ఇస్తుండగా...మరో వైపు షణ్ముఖ్, సిరి ల మధ్య కూడా అలాంటి ప్రేమ బందమే ఉందని చూస్తున్న ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ వీరు మాత్రం మేం జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు. కానీ వీరి వ్యవహారం మాత్రం చూసే వాళ్లకు వేరేలా కనిపిస్తుంది. నిజం గానే వీరి మనసులో ఒకరిపై ఒకరికి ప్రేముందేమో అని అనిపిస్తోంది. అర్థరాత్రి లో షణ్ముక్ బెడ్ పైకి వెళ్లి ఒకే బెడ్ షీట్ కప్పుకుని మరి వీరు ముచ్చటించుకోవడం, పక్కన జస్వంత్ ఉన్నాడనుకోండి.
అయినా అలా అర్థరాత్రి షణ్ముక్ తో  ముచ్చట్లు పెట్టుకోవడం చూసే వారికి కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. సిరి ఏమో షణ్ముఖ్ తో నన్ను దూరం పెట్టకురా నాకు బాధగా ఉంటుంది అని  ఏమోషన్ అవ్వడం చూస్తుంటే ఎవరికైనా  అలాగే అనిపిస్తుంది మరి. హౌజ్ లో దాదాపుగా వీరిద్దరూ ఒకే దగ్గర ఉంటారు. సిరి ఎప్పుడు షణ్ముక్ చుట్టే తిరుగుతూ ఉంటుంది.  బిగ్ బాస్ హౌజ్ లో అసలు తను కూర్చోవడానికి ప్లేసే లేనట్టు ఎప్పుడు చూసినా షణ్ముఖ్ కి అతుక్కుని కూర్చుంటుంది. అయితే సిరికి బిగ్ బాస్ షోకి రాక ముందే యూట్యూబ్ స్టార్ శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరిగిపోయింది. వీరిద్దరి కలసి జోడీ చైల్డ్ ఆర్టిస్ట్‌ చైతూ అనే పిల్లాడిని దత్తత కూడా తీనుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మరి హౌజ్ లో షణ్ముక్ తో ఇవేం పనులమ్మా అంటున్నారు కొందరు నెటిజన్లు. ఎవరేమనుకున్నా మా మధ్య మంచి స్నేహం ఉంది అంటున్నారు వీళ్ళు. కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్‌గా కూడా వర్క్ చేసిన సిరి ఆ తర్వాత పలు సీరియల్ లో నటించింది. "మేడం అంటే మేడం సార్" అనే వెబ్ సిరీస్ లో కూడా చేసింది. అయితే వీరి మధ్య ఉంది స్నేహమా లేదా ప్రేమ అన్నది తెలియాలంటే ఇంకొంతకాలం ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: