టీవీ: సాక్షి రంగారావు వారసుడు బుల్లితెరపై సీనియర్ నటుడు అని మీకు తెలుసా..?

Divya
 
సాక్షి రంగారావు.. ప్రముఖ హాస్యనటుడిగా రంగస్థలం నుంచి వెండితెరపై అడుగు పెట్టి , తన నటనతో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గొప్ప నటుడు.. ఈయన అసలు పేరు రంగవఝుల రంగారావు.. ఈయన 1942 సెప్టెంబర్ 15వ తేదీన గుడివాడ లోని కొండిపర్రు అనే గ్రామంలో జన్మించారు.. లక్ష్మీనారాయణ , రంగనాయకమ్మ అనే దంపతులకు జన్మించిన రంగారావు 1967వ సంవత్సరంలో బాపు-రమణ దర్శకత్వంలో తెరకెక్కిన సాక్షి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఈ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని సాక్షి రంగారావు గా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు..
దాదాపు తెలుగులో 800 సినిమాలకు పైగా నటించి, గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.. ఇక చిన్న కొడుకు సాక్షి శివ కూడా అందరికీ సుపరిచితుడే.. సాక్షి శివ దాదాపు 450 చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని , ఆ తర్వాత బుల్లితెరపై అడుగులు వేశారు. బుల్లితెరపై సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన సాక్షి శివ ,ఎన్నో తెలుగు సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

ఇక ఈయన కేవలం తెలుగు భాష లో మాత్రమే కాకుండా తమిళ్,  మలయాళం టీవీ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించి తనదైన ముద్ర వేసుకున్నారు సాక్షి శివ. ఆయన నటించిన తెలుగు టీవీ సీరియల్స్ విషయానికి వస్తే ఆనందం, అక్క మొగుడు, పసుపు కుంకుమ, మౌనరాగం వంటి సీరియల్స్ ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే మౌనరాగం సీరియల్లో సాక్షి శివ సీనయ్య అనే పాత్రలో నటించి , తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలా  టాలీవుడ్ హాస్యనటుడు సాక్షి రంగారావు వారసుడిగా సాక్షి శివ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,  సినిమాలలో ఇటు సీరియల్స్ లో తనదైన ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: