బిగ్ బాస్ 5:కాజల్ ఆశలను చిదిమేసిన జస్వంత్ ?

VAMSI
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో రోజురోజుకీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎక్కువవుతున్నాయి. మొన్నేమో లోబో తన ప్రేమను కించపరిచచింది అంటూ ప్రియా గురించి హౌజ్ లో నానా రచ్చ చేశాడు. నిన్నటికి నిన్న కాజల్, రవి ల మధ్య అలాగే నట రాజ్ మాస్టర్ రవి ల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక నేడేమో ఏమయ్యిందో ఏమో గానీ జస్వంత్ వల్ల కాజల్ కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీకి దూరమయ్యింది తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బాసే ప్రకటించారు. తాజాగా వచ్చిన బిగ్ బాస్ ప్రోమోలో ఈ విషయం రీవీల్ అయింది. జస్వంత్ ఏమి తప్పు చేశాడో తెలియలేదు. కానీ తను చేసిన పనికి ...ఈసారి తను మాత్రమే కాకుండా కాజల్ కూడా తనతో పాటు కెప్టెన్ పోటీకి అర్హురాలు కాదంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు బిగ్ బాస్.
అయితే అంత పెద్ద తప్పు వీరు ఏమి చేశారు. జస్వంత్ వల్ల కాజల్ కి కెప్టెన్ ఛాన్స్ మిస్ అయిందా లేక కాజల్ వలన జస్వంత్ కెప్టెన్ పోటీదారుడు అవకాశాన్ని కోల్పోయాడా లేక ఇద్దరి వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అన్నది నేటి ఎపిసోడ్ లో తెలియనుంది. అయితే మొదటి రోజు నుండి కెప్టెన్ అవ్వాలని ఆశపడుతున్న కాజల్ కు నిరాశే ఎదురయింది. అదేంటో తెలుసుకోవాలంటే కొంచెం సేపట్లో తెలియనునుంది. ఇక ఈసారి శనివారం నాగ్ మరో గెస్ట్ తో మన ముందుకు రాబోతున్నారు అనే వార్త గట్టిగానే వినిపిస్తోంది. ఇంతకీ  రాబోతున్న  ఆ సెలబ్రిటీ ఎవరు? అని అంతా అనుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి నిజంగా మరో స్టార్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేయనున్నారా? అని అందరూ ఎంతో ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. ఇది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగక తప్పేలా లేదు. కాగా ఈ వారం నామినేషన్ లో ఉన్న మొత్తం ఎనిమిది మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై స్పష్టత రావాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: