బిగ్ బాస్ 5: రవి ఇకనైనా మారుతాడా ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 షో లో శని ఆది వారాల ఎపిసోడ్స్ లో నాగ్ రాకతో హౌస్ లో దనా దన్ ఫటా ఫట్ అయిపోయింది.  పోయిన వారం ఇంట్లో గొడవలను దృష్టిలో ఉంచుకొని ముందుగా ప్రియ మరియు రవి లకు ఓ రేంజ్ లో క్లాస్ ఇచ్చారు నాగ్. ఇక ఇంటి సభ్యులతో ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఆడిస్తూ ఆడిస్తూ ఒక్కొరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చిన నాగ్ చివరికి లహరి ఎలిమినేట్ అయ్యిందని అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ సారి హౌస్ లో ప్రియ, లహరిలతో పోలిస్తే ప్రియనే లహరి విషయంలో రూడ్ గా ప్రవర్తించింది. సో వీళ్ళద్దరిలో అనే డెసిషన్ వచ్చేటప్పటికి అంతా ప్రియనే ఎలిమినేట్ అవుతుందని ఊహించారు. కానీ లహరి ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ గా అనిపించింది. కానీ సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజుల నుండి ఈసారి ఎలిమినేట్ అవ్వబోయేది లహారినే అంటూ వార్తలు చూసాం. 

కానీ ఎక్కడో కాస్త అనుమానం, బట్ నిన్నటి ఎపిసోడ్ లో లహరి ఎలిమినేట్ అవడంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ లీక్స్ నిజమే అని ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ లీక్స్ చేస్తుంది ఏ మహానుభావుడో కానీ అసలు బిగ్ బాస్ ఇంట్లో జరిగేది స్క్రిప్ట్ లో చెప్పినట్టు షూటింగ్ లానా లేక నిజంగానే వారు అలానే ఉంటారా చెప్పండ్రా బాబు అని కొందరు అంటున్నారు. ఇక ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ పైకి వెళ్ళిన లహరి ని నాగ్ ఐదుగురు ఫెయిల్డ్ హౌస్ మేట్స్ గురించి చెప్పాలని అడిగితే.. అందరి గురించి చెబుతాను సార్ అంటూ
తనని హౌజ్ లో టార్గెట్ వాళ్లందరినీ తన మాటల్తో ఎన్కౌంటర్ చేసేసింది అంటే నమ్మండి.
రవి గురించి చెప్తూ హౌజ్ లో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త  కెమెరాలు ఉన్నాయంటూ కౌంటర్ వేసింది. ఇక ప్రియతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త అంటూ రివెంజ్ తీర్చుకుంది. శ్రీ రామ్ గురించి చెప్తూ నీ గురించి కూడా నువ్ కాస్త టైం ఇచ్చుకో శ్రీ  రామ్ కు చెప్పింది. అంటే ఇండైరెక్ట్ గా హమీదా వెనక తిరగడం మానేయ్ అని చెప్పిందన్నమాట. ఇలా హౌజ్ తనను  హర్ట్ చేసిన వారందరినీ స్టేజ్ పై నిలబడి ఓ ఆట ఆదేసుకుంది లహరి. కానీ అందరి కన్నా రవిని ఒక చూపుతోనే ఆజన్మ శత్రువులా చేసేసింది. కెమెరాలు అన్నీ మన వైపే చూస్తున్నా ఒకటి గురించి వెనుక మాట్లాడడం కరెక్ట్ కాదని తెగేసి చెప్పింది. ఇకనైనా రవి ఆ పద్దతి నుండి బయటపడతాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: