వచ్చీ రాగానే రచ్చ.. అక్కడికి వెళ్తున్నా రమ్మంటూ సరయు సవాల్ !

Divya
7 ఆర్ట్స్ సరయు.. డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ అని చెప్పవచ్చు.. నిజాయితీగా తానేంటో నిరూపించుకోవడమే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది సరయు.. ఇకపోతే సరయు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేయడానికి బిగ్ బాస్ లో అందరినీ ధూమ్ ధాం చేస్తానని చెప్పి వెళ్ళింది.. కానీ వారం తిరగకుండానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదివారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఆమె బిగ్ హౌస్ నుంచి వచ్చీ రాగానే షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి, చైత్ర అనే పాప ఇంటికి వెళ్తున్నాను.. దమ్ముంటే అక్కడికి రమ్మని సవాల్ విసిరింది..
ఇటీవల ఫేస్ బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేసి, తన ఆవేదన వ్యక్తం చేసింది సరయు.. ఇక వీడియోలో సరయు మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో నాకు సపోర్టు ఇచ్చి, నాకు అండగా నిలబడిన అందరికీ నా వాళ్లందరికీ.. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్ ల గురించి కానీ వీడియోలు చేయాలని అనుకోలేదు. కానీ జరిగిన కొన్ని అనర్థాల వల్ల నేను ఈ వీడియో చేయక తప్పడం లేదు.

మొదటిది ఏమిటంటే.. ఎవరో షణ్ముఖ్ ఫ్యాన్స్ అట.. సోషల్ మీడియాలో పర్సనల్ గా నాకు మెసేజ్ లతో పాటు కాల్స్ కూడా చేస్తున్నారు. ఇక రెండవది ఏమిటంటే చైత్ర అనే ఆరు సంవత్సరాల పాప ని అత్యాచారానికి పాల్పడి చంపేశాడు ఒకడు. వాడిపై సింగరేణి కాలనీ లో 144 సెక్షన్ కూడా పెట్టారు. ఆ పాపకు కాని, వారి తల్లిదండ్రులకు కానీ నన్ను బ్లేమ్ చేయడానికి కేటాయించిన సగం టైం లో కూడా వారికి మీరు కేటాయించలేదు. మా ఇల్లు సరూర్ నగర్ లోనే.. సింగరేణి కాలనీ కి కొంచెం దూరంలో ఉంటుంది. నేను వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్తున్నాను.. మీకు దమ్ముంటే.. మీరు మనుషులైతే.. వచ్చి ఆ పాప తల్లిదండ్రులకు సపోర్ట్ ఇవ్వండి.. మీకు చేతనైనంత సహాయం చేయండి.. దాని తర్వాత వచ్చి మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో..అవి మాట్లాడండి అంటూ చాలా కఠినంగా మాట్లాడింది సరయు..

ఈ మాటలు విన్న తర్వాత ఈమె ఎంత భావోద్వేగాలకు గురి అవుతుందో అర్థం చేసుకోవచ్చు . ఎవరైనా ఫాన్స్ ఒకరిని మాట్లాడాలి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు గౌరవించడం నేర్చుకోవాలి.ఆ  పైన ఎవరో ఒకరు ఏదో అన్నారని ఒకరిపైన ఇలా చాలా అసభ్యకరంగా మాట్లాడకూడదు.. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఆమె షణ్ముఖ్ ను  ఒక మూల కూర్చో అనడానికి గల కారణాన్ని  రేపు ఉదయం 11 గంటలకు సెవెన్ ఆర్ట్స్ లో చూపిస్తాను అంటూ అందరికీ సవాల్ విసురుతోంది. దీన్ని బట్టి చూస్తే సరయు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: