ఉమా దేవిపై శ్వేతా వర్మ ఉగ్ర రూపం... అసలేం జరిగిందంటే ?

VAMSI
నిన్న ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 ఎపిసోడ్ లో కొందరి ఇంటి సభ్యుల అసలు రూపాలు బయటపడ్డాయి. నిన్న మొన్నటి వరకు సాఫ్టు గా కనిపించిన శ్వేత వర్మ నిన్నటి ఎపిసోడ్ లో ఆటో బాంబ్ లా పేలింది, కంటెస్టెంట్ లు  పై విరుచుకుపడింది. ఒకరకంగా చెప్పాలంటే వారిని తన మాటలతో పచ్చడి పచ్చడి చేసేదిందంటే నమ్మండి. షో చూస్తున్న వారంతా వామ్మో ఈమె శ్వేతనేనా అంటూ షాక్ అయ్యారు. ఇంత వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా శ్వేత వర్మ తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టి రఫ్ ఆడించేసింది. ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళితే. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. 

రంగు కొట్టు నామినేషన్ కి జై కొట్టు అనే టాస్క్ ఇచ్చి కంటెస్టెంట్ లను రంగులతో కొట్టుకుంటారో, లేక సరదాగా ఒక గేమ్ లా ఆడుకుంటారో మీ ఇష్టం అంటూ మొత్తానికి రంగులు పూసి నామినేట్ చేయండి అని ఆర్డర్ వేశారు. ఇంకేముంది నామినేట్ చేయాలంటే సరైన కారణం చెప్పాలిగా మరి అందుకే హౌస్ లో జరిగిన పాత విషయాలను గ్రైండర్ రుబ్బినట్టు రుబ్బి గుర్తు చేసుకుని మరీ ఒక్కొకరిని నామినేట్ చేశారు కంటెస్టెంట్స్. ఈ నామినేషన్ లో అందరికన్నా శ్వేత వర్మ బాగా హైలెట్ అయ్యారు అందుకు ఈమె నామినేషన్ ప్రక్రియలో ఫుల్ ఫైర్ అవ్వడమే ముఖ్య కారణం.

టాస్క్ జరుగుతున్న  సమయంలో రంగు పోసింది లోబో మరియు హామీదా కి కానీ క్లాస్ పీకిందేమో  ఉమాదేవి కి, హ్యుమానిటీ లేదు, అమ్మాయిని కూడా ఏమాత్రం చూడలేదు అంటూ ఉమా దేవి పై విరుచుకుపడింది. ఇచ్చి పడేస్తా అంటూ హౌస్ లోకి ఎంటర్ అయిన శ్వేత వర్మ నిన్నటి ఎపిసోడ్ లో ఉమ దేవికి క్లాస్ బాగానే ఇచ్చింది. ఈమె ఆగ్రహం చూసి ఎవరినైనా కొట్టేస్తుంది ఏంటి అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు హౌస్ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: