టీవీ : బిగ్ బాస్ మానస్ సినిమాల్లో నటించాడని మీకు తెలుసా..?

Divya
ది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ సీజన్ 5 లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మానస్ కూడా ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ సైలెంట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే ఇటీవల చాలామంది మానస్ ఎవరు ..? ఎక్కడి నుంచి వచ్చాడు..? అని వెతకడం మొదలు పెట్టారు. ఇక మానస్ గురించి తెలియని ఒక విషయం..ఏమిటంటే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంత మంది స్టార్ హీరోల సినిమాలలో నటించాడట.
మానస్ మొదట బాల నటుడి గా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. మొదట సోడా గోలి సోడా, కాయ్ రాజా కాయ్ , గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ఝలక్ వంటి సినిమాలను బాలనటుడిగా నటించి అప్పట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక అంతే కాదు బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ తో పాటు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. ఆ తర్వాత కొన్ని షోలలో కూడా మానస్ నటించడం గమనార్హం. మానస్ 1991 ఆగస్టు 2వ తేదీన ముంబైలో జన్మించాడు.
తండ్రి పేరు వెంకట రావు..  వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వైజాగ్ , ముంబై , గోవా వంటి తదితర ప్రదేశాలలో బదిలీపై వెళ్లి పని చేశారు. మానస్ తల్లి పద్మిని దేవి. ఈమె ఆంధ్ర యూనివర్సిటీ లో లెక్చరర్ గా పని చేస్తుండడంతో మానస్ కూడా ఇంజనీరింగ్ విద్యను భోగరాజు గంగరాజు కళాశాలలో పూర్తి చేసాడు.. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. ఇకపోతే నటన పై మక్కువ ఎక్కువ ఉండడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. ఇక కోయిలమ్మ సీరియల్ లో కూడా హీరోగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: