గత వారం రోజుల నుండి ఈ ఇంటిలో చూసినా బిగ్ బాస్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు ఏదో ఆడుతున్నట్లు ఫీల్ అయిపోతున్నారు. టీవీ చూస్తూనే వారికి ఇక్కడ నుండే సలహాలు ఇవ్వడం, బాగా ఆడని వారిని వీళ్ళే జడ్జ్ చేయడం ఇలా ఎన్నో చర్చలు అనుకోండి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు లో మొదటి నామినేషన్ కాస్తా రాత్రి జరిగిపోయింది. గత మూడు రోజుల నుండి వస్తున్న వార్తల ప్రకారమే యూట్యూబ్ స్టార్ సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. కానీ సరయు హౌస్ లోకి వచ్చే ముందు చెప్పిన మాటను నిజం చేయలేకపోయింది. అందరినీ "దమ్ దమ్ చేస్తా" అని హౌస్ లోపలికి వెళ్లి వారం కాగానే ఎలిమినేట్ అయింది.
అయితే ఏమి వెళ్లే ముందు స్టేజ్ పై నాగార్జున ఇచ్చిన లాస్ట్ టాస్క్ లో బెస్ట్ 5 మరియు వరెస్ట్ 5 సభ్యులు ఎవరు కారణం ఏమిటని చెప్పాలి. ఇందుకు వరెస్ట్ సభ్యులుగా కెప్టెన్ సిరి, షణ్ముఖ్, కాజల్, సన్నీ మరియు లహరి లను ఎంచుకుంది. వీరినే ఎంచుకోవడానికి కారణాలు చెబుతూ సిరి అందరూ తన దగ్గరే ఉండాలనుకుంటుంది. తాను గెలవడానికి హౌస్ లో ఇంకొకరిని యూజ్ చేసుకుంటోంది అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అంతే కాకుండా కొంత మంది బయట నుండి వచ్చేటప్పుడు అంతా ప్లాన్ చేసుకుని వచ్చారు.
సిరి షణ్ముఖ్ లు చాలా ప్లాన్ చేసుకుని వచ్చారు అంటూ బాంబ్ పేల్చింది. ఈ మాటలకు సిరి మరియు షణ్ముఖ్ లు వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా మీరు మీ మనసును అడగండి, అది ఏమి చెబితే ఆడండి అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ మాటలు విన్న మిగతా ఇంటి సభ్యులు మరియు నాగార్జున షాక్ అయ్యారు. అలా సరయు రాయ్ బిగ్ బాస్ జర్నీ క్లోజ్ అయింది.