తెలుగు బాస్ సీజన్ 5 గత వారమే ఎంతో వైభవంగా మొదలైంది. ఇక అప్పటి నుండి ప్రతి ఇంట్లోనూ పందొమ్మిది కంటెస్టెంట్ల కబుర్లు వినిపిస్తూనే ఉన్నాయి.
హౌస్ లో ప్రతి ఒక్కరి నడవడిక, తీరు, మాట్లాడే విధానాన్ని బట్టి వారికి ప్రజాదరణ లభిస్తుంది. అదే రీతిలో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
బిగ్ బాస్ మొదలయ్యి వారం కావస్తోంది కొందరు ఇంటి సభ్యులు మొదటి ఒకటి రెండు రోజులు కాస్త అడ్జస్ట్ అవడానికి టైం తీసుకున్నా ఇప్పుడు అందరూ సెట్ రైట్ అయిపోయారు. ఇప్పుడు ప్రేక్షకులందరి చూపు కంటిస్టెంట్ల వ్యవహారశైలిపై పడింది. తాజా సమాచారం ప్రకారం హౌజ్ లో విశ్వకు బయట ప్రేక్షకులలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
విశ్వ
హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఒకే ఆటిట్యూడ్ ను కలిగి ఉండటం పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు రంగులు మార్చకుండా తాను తనలాగే ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ పాయింట్
ఆడియన్స్ గా బాగా కనెక్ట్ అయిందని అంటున్నారు.
హౌస్ లో అందరికి గౌరవం ఇస్తాడు. అందరితోనూ సరదాగా మాట్లాడతాడు. ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడితే వారికి నచ్చుతుందో అన్న మెచ్యూరిటీని కనబరుస్తున్నాడు. అదీకాక ఫిజీకల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. హౌజ్ లో మొదటి సారి జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా గెలవడానికి పూర్తి స్థాయిలో తన వంతు ప్రయత్నం తాను చేశాడు. కానీ మధ్యలో
కాజల్ సైకిల్ లో
నూనె పోయడంతో
విశ్వ మధ్యలోనే పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే ఇది కూడా ఒకరకంగా విశ్వకు ప్లస్ పాయింట్ గానే మారింది. విశ్వకు ఇక్కడ అన్యాయం జరిగిందనే ఆలోచన, స్పందన
ఆడియన్స్ నుండి వినిపిస్తోంది. ఇలా అన్ని రకాలుగా
విశ్వ ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన ఫ్యాన్స్ లిస్ట్ ను కలుపు కుంటున్నాడు. ఈ విధంగా చూస్తే
విశ్వ రోజూ రోజుకీ టైటిల్ కోసం పోటీ పడే వారిలో ఒకరిగా ఉంటాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.
బిగ్ బాస్ హౌస్ లో అందరిలోనూ విశ్వ రాకెట్ లా దూసుకెళ్తున్నాడు.