టీవీ : అప్పట్లో పోలీసులకు చిక్కిన లోబో.. కారణం..?

Divya
ప్రస్తుతం బిగ్ బాస్ షోలో అందరికీ వినోదాన్ని పంచుతున్న కంటెస్టెంట్ లోబో. చూడడానికి మనిషి విచిత్రంగా ఉన్న తొలిరోజు నుంచే బాగా ఆకట్టుకుంటున్నాడు ప్రేక్షకులను. ఇక నిన్నటి రోజున అయితే లోబో బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టేశాడు అని చెప్పుకోవచ్చు.

ఇక బిగ్ బాస్ షో కి రాకముందు లోబో టాటూ డిజైనర్ గా, యాంకర్ గా ఇలా మల్టీ టాలెంట్ తో ఆకట్టుకున్నాడు  లోబో.. అయితే లోబో ఇంతకు ముందు కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. అందులో రాహుల్ సిప్లిగంజ్.. మద్యం సేవించి పోలీసులకు చిక్కినప్పుడు.. అక్కడ లోబో పేరు కూడా వినిపించింది. ఇక అంతే కాకుండా బిగ్ బాస్ షో తనకి నచ్చదు అన్నట్లుగా గతంలో తెలియజేసినట్లు పలు కామెంట్లు చేసి ప్రస్తుతం అదే షో కి రావడం పట్ల ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ జరిగాయి.
ఇక అంతే కాకుండా 2018 సంవత్సరంలో జాతీయ రహదారిపై ఒక ప్రమాదం జరిగింది.. దాంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. ఇక మరి కొంత మందికి గాయాలు అయ్యాయి.. లోబో  కూడా అప్పుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్టీరింగ్ బెలూన్ ఉండడంవల్ల  ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే లోబో తాగి డ్రైవ్ చేయడం వల్లే ఇదంతా జరిగిందని... అప్పట్లో వార్తలు వినిపించాయి. వాటిపై లోబో వివరణ ఇచ్చాడు.
ఆ యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం రోడ్డు చిన్నగా ఉండడం వల్ల ఆ ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తను షూటింగ్ స్పాట్ కు వెళ్లి వస్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పుకొచ్చాడు... తప్పు ఎలా చేసిన తప్పే కాబట్టి.. ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి నా వంతు సహాయంగా నేను చేశాను అని చెప్పుకొచ్చాడు. అందుకే తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పాడు.ఇక అంతే కాకుండా యాక్సిడెంట్ జరిగిన కార్ కి 20 లక్షలు అడిగినట్లు చెప్పుకొచ్చాడు.

ఇక ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వారింట్లో కుటుంబంలోనూ ఒక అబ్బాయికి హైదరాబాద్ లో జాబు చూపించానని చెప్పుకొచ్చాడు లోబో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: