టీవీ: ఆనీ మాస్టర్ గురువు వీరే నట..!

Divya
ఆనీ మాస్టర్ ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ఈమె, తన డాన్స్ స్టెప్పులతో కుర్రకారులో నిద్ర లేకుండా చేస్తోంది. ఇకపోతే ఈమె గత కొన్ని నెలల పాటు ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ జోడి రియాల్టీ షోకి జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అక్కడ అంత మంచి పేరు తెచ్చుకున్న ఆనీ మాస్టర్ ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఈమె కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మూడవ ఎపిసోడ్ లోనే మరో కంటెస్టెంట్ జెస్సీతో తీవ్రంగా గొడవ పడిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆనీ మాస్టర్ తన గురువు ఎవరో తెలిపింది.. ఆయనెవరో మనం ఒకసారి చూసి తెలుసుకుందాం..

బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆనీ.. మరొక కొరియోగ్రాఫర్ గా నటరాజ్ మాస్టర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ప్రవేశించారు. ఆయన ప్రవేశించిన వెంటనే ఆనీ మాస్టర్ నటరాజ్ మాస్టర్ ను కలసి ..సార్ మీ దగ్గర నేను కొరియోగ్రఫీ నేర్చుకొని, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. అంటూ చెప్పింది. ఇక ఆనీ మాస్టర్ చెప్పిన మాటలకు పొంగిపోయిన నటరాజ్ మాస్టర్ ,చాలా సంతోషంగా ఉంది.. ఇంకా అత్యధిక  స్థాయికి మీరు చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను ..ఆల్ ద బెస్ట్ అమ్మ ..అంటూ  అని ఆనీ మాస్టర్ ను ఆశీర్వదించాడు..
ఇక నటరాజు మాస్టర్ చాలా బలవంతంగా భార్యను విడిచి రాలేక ,బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల పుష్ప సినిమాలో ఒక పాట పులి -  మేక పాటకు కొరియోగ్రఫీ చేసి, ఓవర్ నైట్ లోనే స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందాడు. ఇకపోతే నటరాజ్ మాస్టర్ కూడా ప్రేక్షకులకు నచ్చేలా సినిమా లోని పాటల కంటెంట్ కు తగ్గట్టుగా తను కొరియోగ్రఫీ చేస్తానని అందుకే ఈ స్టేజ్ లో ఉన్నానని ఆయన తెలిపాడు. ఏది ఏమైనా పులి -  మేక కొరియోగ్రఫీ అదుర్స్ అంటున్నారు చూసినవాళ్లంతా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: