టీవీ: హూ ఆర్ యూ అంటూ ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్..!

Divya
షణ్ముఖ్ జస్వంత్.. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన వ్యక్తి అని చెప్పవచ్చు.. మొదట కవర్ పేజీ సాంగ్ షూట్ చేస్తూ, ఆ తర్వాత వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మంచి నటుడిగా సోషల్ మీడియా లో దూసుకుపోతున్న సమయంలో, ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు..ఆమె సునైనా.. వీరిద్దరి మధ్య ప్రేమ దాదాపుగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అంటూ కూడా ట్రొలింగ్ కు కూడా గురయ్యారు.. ఎన్నో బాధలు, కష్టాలు ఎదుర్కొని నెగిటివ్ లో నుంచి తేరుకొని బిగ్ బాస్ వేదికగా తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు షణ్ముఖ్ జస్వంత్..
ఎట్టకేలకు షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. నాగార్జున అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పాడు షణ్ముఖ్.. అంతేకాదు తనలో ఎన్ని క్యారెక్టర్స్ వున్నాయో  లోపల చూపిస్తాను సార్ అంటూ కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ కు మిగతా కంటెస్టెంట్స్ అందరూ చాలా గ్రాండ్ గా ఆహ్వానించడం జరిగింది.. వారందరితో మొదటిరోజే బాగా కలిసిపోయారు షణ్ముఖ్..
ఇక షణ్ముఖ వ్యక్తిగత విషయానికి వస్తే , ఆయన 1994వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు.. ఇక తన విద్యాభ్యాసాన్ని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో తన ఉన్నత విద్యను పూర్తిచేశాడు. 2019 జూలై నాటికి యూట్యూబ్లో మొత్తం 3.9 విలయంలో సబ్స్క్రైబర్లు కలిగి ఉండడం గమనార్హం. ఇక షణ్ముఖ్ జస్వంత్ ను అందరూ షన్ను అని కూడా పిలుస్తుంటారు. యూట్యూబ్ లో బాగా ట్రెండ్ క్రియేట్ చేస్తూ, సరి కొత్త ఆల్బమ్స్ తో కుర్రకారును ఆకట్టుకున్న నటుడు అలాగే డాన్సర్ అని కూడా చెప్పవచ్చు..తన డాన్స్ లతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: