టీవీ: అందుకే రోజా.. రోహిణికి ముద్దు పెట్టిందా..?

Divya
బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎన్నో సంవత్సరాల నుండి మంచి కామెడీ షోగా కొనసాగుతూనే ఉంది. ఇక టీఆర్పీ రేటింగ్ లో కూడా అన్ని ఛానల్స్ తో పాటే బాగా దూసుకుపోతోంది. ఇక ఇందులోని కమెడియన్స్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు. అయితే ఇప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా, అందులో ఒక సెలబ్రిటీ కి ముద్దు పెట్టింది. దానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం.
జబర్దస్త్ షో లో ఇప్పుడిప్పుడే బాగా పేరు సంపాదించుకుంటోంది నటి రోహిణి.అయితే ఈమె రాకెట్ రాకేష్ టీమ్ లో నటిస్తోంది.ఇక ఈమె తనదైన పంచులతో, పాత్రలతో, వచ్చి ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఇక అంతే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి, ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది. ఇక ఈమె ఓకే టీం అనుకోకుండా అన్ని టీంలలో కూడా చేస్తూ ఉంటుంది.

అయితే రోహిణి తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో రోజా తనకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేయగా, తను కట్టుకున్న చీరలో ఎంతో ముద్దు వస్తుందని, తనదైన శైలిలో తనకి ఒక ముద్దు ఇచ్చి , తన ఆనందాన్ని వ్యక్తం చేసింది రోజా. ఇక అంతే కాకుండా ఈ ఫోటోను ఎంతో తీపి గుర్తుగా ఉంచుకుంటాను అంటూ తెలిపింది రోహిణి.
ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది. ఇక రోహిణి విషయానికొస్తే,  ఈమె ఇప్పుడు సీరియల్స్ చేయడానికి ఒప్పుకోలేదట.అందుకు గల కారణం ఏమిటంటే జబర్దస్త్ లో బాగా ఈమెకు కమెడియన్ గా  పేరు రావడంతో, తను ఈ ప్రోగ్రాంలోనే ఉండాలి అనుకుంటుందట. ఇక అంతే కాకుండా ఇందులో అందరికీ సమానంగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇక అంతే కాకుండా ఏదైనా సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది రోహిణి. ఇకపోతే రోహిణి బుల్లితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంది.ఇక  త్వరలోనే వెండితెరపై కూడా అవకాశాలు తెచ్చుకోవాలని మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: