టీవీ:చిన్నప్పుడే పెళ్లి చేసుకొని నరకం చూసానంటున్న నటి..
ప్రస్తుతం బుల్లితెరపై మహతి పలు సీరియల్ లో నటిస్తుంది. కానీ ఈమె తెరపైన కనిపించేంత నవ్వు, తెరవెనుక ఉండదట. దానికి గల కారణం ఏమిటంటే తన కుటుంబ బాధ్యతలను తన మీద వేసుకున్నదట. దీంతో ఆమె ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నది.
ఈమె ఇలా ఎంతో కష్టపడి సంపాదించుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుకుంటూ వచ్చి, ఇప్పుడు సీరియల్స్ ను నిర్మించే స్థాయికి ఎదిగింది మహతి. ఈ విధంగా తను పడిన కష్టాలను ఒక ప్రముఖ ఛానల్ ద్వారా తను తెలియజేసింది. .. తనకు కోట్ల ఆస్తి ఉన్నా ,అవి తనకు ఆనందాన్ని ఇవ్వలేదట. కేవలం తన కలను నెరవేర్చడం కోసం హైదరాబాద్ కి వచ్చానని తెలిపింది.
అలా ఆమె 17 సంవత్సరాలకే తమ తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారట. దాంతో అటు కుటుంబ బాధ్యతలు, ఇటు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడి ఎదిగింది ఈమె. ఇక ఎలాగైనా సరే తను నటిగా గుర్తింపు పొందాలని,తిరిగి మరి తన పిల్లలతో హైదరాబాదుకి వచ్చేసిందట. అలా వచ్చిన ఆమె ఒక ఇరుకు గదిలో ఉంటూ, జీవనం కొనసాగిస్తూ, నటి అవ్వడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేదట.
అలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ, తన పట్టుదలను వదలకుండా తన కలను నెరవేర్చుకుంది నటి మహతి. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై బాగా రాణిస్తున్నది. కానీ ఈమె నటన కి గుర్తుండి పోయేలా ఒక పాత్ర చేయాలని తన కోరిక గా ఉందని తెలిపింది. ఈమె పలు సీరియల్స్ తో పాటు, పలు సీరియల్ లను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఏదిఏమైనా కష్టాల కడలి దాటితేనే సుఖాలు సంగమం దొరుకుతుంది అని గుర్తుంచుకోవాలి.