"దేవత" సీరియల్ లో నంద కుట్ర నుండి సత్య బయటపడుతుందా ?
అంత త్యాగం చేస్తే అలాంటి వాడితో పెళ్ళి చేసి ఆ త్యాగానికి అర్థం లేకుండా చేస్తారా..?? అని కొందరు . సత్య అటు తిరిగి ఇటు తిరిగి ఆదిత్య జీవితం లోకి వచ్చే బదులు ఇదే మంచిదని కొందరు. అసలు సత్య చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనే టెన్షన్ భరించలేకపోతున్నాము అని మరికొందరు ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం నందతో సత్య పెళ్లి పీటల వరకు వెళ్తుంది. కానీ, చివరి నిమిషంలో వేదవతి కొడుకు డాక్టర్ బాబు వచ్చి పెళ్లిని ఆపేసి నంద పెద్ద దుర్మార్గుడని నిరూపించి ... ఆదిత్య విషయం బయట పెట్టకుండానే పెద్ద మనసుతో సత్యను పెళ్లి చేసుకుంటాడట.
ఇది జరగబోయే ఎపిసోడ్ అని తెలుస్తున్న సమాచారం. ఇలా జరిగితేనే ప్రేక్షకులు కూడా సంతృప్తి పడతారు. కానీ సీరియల్ అన్నాక ప్రేక్షకులు ఊహించని విధంగా కథను నడిపించడమే అని తెలిసిన విషయమే. మరి రానున్న ఎపిసోడ్స్ లో ఏంజరగబోతోంది ? సత్య ఈ కుట్ర నుండి ఎలా బయటపడుతుంది. దేవుడమ్మకు నిజం తెలుస్తుందా ? అన్న ఉత్కంఠ పరిణామాల మధ్యన ఈ రోజు ఎపిసోడ్ ఏమవుతుందో చూడాలి.