ఇష్టం , ప్యాషన్ ఉంటే ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు - కార్తీకదీపం భాగ్యం..!!

Mamatha Reddy
సినిమా ఇండస్ట్రీలో లోకి రావాలి అంటే ఇష్టం తో పాటు ప్యాషన్, ఎదగాలనే కోరిక కూడా ఉండాలని, అవి ఉన్నప్పుడు మిగతావన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి అని చెప్తుంది నటి ఉమా.. కార్తీకదీపం సీరియల్ లో దీప సవితి తల్లి గా నటిస్తున్న ఉమా, పలు సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తుకు తెచ్చుకో గా ఈ సీరియల్ తో తన పాపులారిటీని ఇంకా పెంచుకుంది.. మొదట్లో ఈ పాత్ర వల్ల తనకు విమర్శలు వచ్చినా ప్రస్తుతం విమర్శకుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది.. ఇదే కాకుండా పలు సీరియల్స్ లో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తుంది..

వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె బోర్డు పాత్రలలో ఎక్కువ గా నటించింది.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు పంచుకుంది.. తను ఇండస్ట్రీకు వచ్చినప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, తను తెచ్చుకున్న గుర్తింపుల కింద అవి చాలా చిన్నవిగా కనిపించాయి అని ఆమె వెల్లడించింది.. ఇబ్బంది అనుకుంటే ఎక్కడైనా ఇబ్బంది ఉంటుందని, మనలో కసి ఉంటే ఎలాంటి సమస్య అయినా ఆ కోరిక ముందు చిన్నదిగా కనిపిస్తుంది అని వెల్లడించింది..

తనకు తన ఫ్యామిలీ నుండి పూర్తి సపోర్ట్ ఉంది అందుకే నేను ఇంత మంచి ఆర్టిస్ట్ గా అవగలిగానని చెప్తుంది. బోల్డ్ పాత్రలలో ఎక్కువగా నటించిన తనకు ఎక్కువ ఇబ్బంది రాలేదని చెబుతుంది ఉమా.. ఒక ఆర్టిస్ట్ తన కెరీర్ ని ప్రొఫెషనల్ గా భావించినప్పుడే ఏ పాత్ర అయినా ఇష్టంగా చేస్తాడని నేను ఇప్పటికీ ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పింది.. ఈ పాత్రలో ఎందుకు నటించానని ఆమె ఏనాడు అనుకోలేదు.. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమె పాత్రల ఎంపికలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు అట.. అందుకే బోల్డ్ పాత్ర లు తనకు ఎక్కువగా వచ్చాయి అని చెబుతోంది.. ఏదేమైనా నా సినిమా ఇండస్ట్రీలో రాణించాలన్నా ఎదగాలన్న ఆమె చెప్పినట్లు ప్యాషన్ ఉండాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: