ఇష్టం , ప్యాషన్ ఉంటే ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు - కార్తీకదీపం భాగ్యం..!!
వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె బోర్డు పాత్రలలో ఎక్కువ గా నటించింది.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు పంచుకుంది.. తను ఇండస్ట్రీకు వచ్చినప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, తను తెచ్చుకున్న గుర్తింపుల కింద అవి చాలా చిన్నవిగా కనిపించాయి అని ఆమె వెల్లడించింది.. ఇబ్బంది అనుకుంటే ఎక్కడైనా ఇబ్బంది ఉంటుందని, మనలో కసి ఉంటే ఎలాంటి సమస్య అయినా ఆ కోరిక ముందు చిన్నదిగా కనిపిస్తుంది అని వెల్లడించింది..
తనకు తన ఫ్యామిలీ నుండి పూర్తి సపోర్ట్ ఉంది అందుకే నేను ఇంత మంచి ఆర్టిస్ట్ గా అవగలిగానని చెప్తుంది. బోల్డ్ పాత్రలలో ఎక్కువగా నటించిన తనకు ఎక్కువ ఇబ్బంది రాలేదని చెబుతుంది ఉమా.. ఒక ఆర్టిస్ట్ తన కెరీర్ ని ప్రొఫెషనల్ గా భావించినప్పుడే ఏ పాత్ర అయినా ఇష్టంగా చేస్తాడని నేను ఇప్పటికీ ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పింది.. ఈ పాత్రలో ఎందుకు నటించానని ఆమె ఏనాడు అనుకోలేదు.. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమె పాత్రల ఎంపికలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు అట.. అందుకే బోల్డ్ పాత్ర లు తనకు ఎక్కువగా వచ్చాయి అని చెబుతోంది.. ఏదేమైనా నా సినిమా ఇండస్ట్రీలో రాణించాలన్నా ఎదగాలన్న ఆమె చెప్పినట్లు ప్యాషన్ ఉండాల్సిందే..