బుల్లి తెరపై హంగామా చేయబోతున్న రానా..

Satvika
రానా దగ్గుపాటి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాలతో ఒకవైపు బిజీగా ఉంటూనే మరో వైపు బుల్లి తెర షో లలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అభిమానులకు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రానా నెంబర్ వన్ యారి సీజన్ 3పై కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను స్పీషల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. మూడవ సీజన్ లో రానాతో కొంతమంది బిగ్ స్టార్స్ సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


అయితే, బుల్లి తెర పై హీరో లతో హోస్టింగ్ చేస్తున్న షో లు అన్నీ మంచి క్రేజ్ ను అందుకున్నారు.నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి అలాగే జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి స్టార్స్ రియాలిటీ షోలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారి కూడా బాగా పాపులర్ అయ్యింది.రెండు సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఆ షో మూడవ సీజన్ తో మరింత ఫన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యింది.


రానా హోస్టింగ్ తో షోను బోల్డ్ గా నడిపిస్తూ ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాడు. అప్పట్లో ఈ షోకు బిగ్ బాస్ కంటే హై రేంజ్ లో రేటింగ్ దక్కింది. ఇక ఇప్పుడు ఆహా యాప్ లో వస్తోంది. నెంబర్ వన్ యారీ కోసం జనాలు ఆహా యాప్ వైవు బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు.రానున్న రోజుల్లో రానా సీజన్ 3కి మరింత క్రేజ్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెవర్ బిఫోర్ అనేలా బిగ్ స్టార్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ కు జాతిరత్నాలు టీమ్ తో మంచి క్రేజ్ ను అందుకుంది. ఈ మధ్య బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన చిత్ర యూనిట్ షో లో పాల్గొని సందడి చేశారు. నాగార్జున తో ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. రకుల్, మంచు లక్ష్మి , విశ్వక్ సేన్, వైష్ణవ్ తేజ్ వంటి వాళ్ళతో కూడా షూట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే ఎపిసోడ్స్ లలో మెగా స్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా యారీ ప్రోగ్రామ్ లో సందడి చేయబోతున్నట్లు సమాచారం.. షో లో యాంకర్ గా రానా ఏం చేసినా అది గుడ్ రిజల్ట్ ను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: