అఖిల్ ను మోనాల్ అంతమాట అనేసిందా?

Satvika
బిగ్ బాస్ లో రచ్చ చేసిన జంటలు అందరూ బయట కూడా అంతే క్రేజ్ ను అందుకుంటున్నారు. మూడు సీజన్ల లో ఉన్న జంటల తో పోలిస్తే నాలుగో సీజన్ జంటలు కాస్త ఎక్కువగా క్రేజ్ ను అందుకున్నారు. అందులో మోనాల్, అఖిల్ ఫెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది సినీ రంగం లోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును అందుకుని స్టార్లుగా నిలుస్తారు. మిగిలిన వాళ్లు మాత్రం పెద్దగా పేరు తెచ్చుకోలేరు. అలాంటి వాళ్లే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. అందులో మిస్టర్ హ్యాండ్సమ్ అఖిల్ ఒకరు.


తన మాటల తో బాగా ఆకట్టుకున్నాడు. ఇలాంటి సమయం లోనే తాజాగా అతడు ఓ శుభవార్త ను చెప్పాడు. దీనికి మోనాల్ గజ్జర్ కూడా కామెంట్ చేసింది. సినిమాల్లో నటించాలన్న కోరిక తో మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. అలా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ ఇన్ హైదరాబాద్‌ గా ఎంపికయ్యాడు. అదే సమయం లో 'బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఓ సీరియల్ లో నటించాడు కానీ, అంతగా గుర్తింపు తీసుకురాలేదు.


బిగ్ బాస్ హౌస్‌ లో రచ్చ రచ్చ చేసిన మోనాల్ - అఖిల్ బయట కూడా అదే ఫాలో అవుతున్నారు. తరచూ కలవడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసి జంటగా 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ ‌లో నటిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్ ‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..నెటిజన్లు ఈ విషయంలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వెబ్ సిరిస్ ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: