రవి, లాస్య ల మధ్య రొమాన్స్ మళ్లీ మొదటికి వచ్చిందా?

Satvika
  1. బుల్లి తెరపై యాంకర్లు బాగా ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా జంట యాంకర్లు బాగా పాపులర్ అవుతున్నారు. టీవీ లో మాత్రమే కాదు  యూట్యూబ్ లో బాగా క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.అయితే ఒకప్పుడు బుల్లి తెర పై హవాను కొనసాగించిన జంట రవి, లాస్య లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర పై ట్రాకులు, పులిహోర అనేది ఈ ఇద్దరి నుంచే మొదలైనట్టుంది. బుల్లితెర పై ఓ షో లో కనిపించి, కెమిస్ట్రీ వర్కవుట్ అయి ఓ జంటకు అంత పేరు రావడం అదే మొదటిసారి.


అలా మార్నింగ్ షోతో గుడ్ మార్నింగ్ అంటూ చెబుతూ మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం విజయవంతంగా కొనసాగింది. రవి, లాస్య అంటే బుల్లితెర ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారికి కూడా రవి లాస్య జంటకు క్రేజ్ ఉంటుంది. సంథింగ్ స్పెషల్ అంటూ ఉదయాన్నే అందరినీ పలకరించేవారు. ఫోన్‌ లో మాట్లాడటం, బయటకు వచ్చి ఈవెంట్లు చేయడం, స్పెషల్ సాంగ్స్ చేయడం వంటి చేస్తూ అప్పట్లో దుమ్ములేపేశారు.


అయితే కొన్ని మనస్పర్థలు కారణంగా విడిపోయారు. ఇప్పుడు మళ్లీ హవాను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కలిసి పోయారు. ఇద్దరూ కూడా మునుపటిలా మంచి స్నేహితుల్లా కలిసే ఉంటున్నారు. సోషల్ మీడియా లో లైవ్ ‌లోకి కూడా వస్తున్నారు. తాజాగా కామెడీ స్టార్స్‌ లో ఈ ఇద్దరూ చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ అనే షోలో ఉప్పెన స్ఫూప్‌లో రవి లాస్య నటించారు. జలజల పాతం అనే పాటకు అదిరిపోయేలా రొమాన్స్ చేశారు.. మొత్తానికి ఇలా మళ్లీ కలిసి స్టేజ్ మీద హంగామా చేస్తున్నారు. మళ్లీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.. నెటిజన్లు కూడా విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: