వంటలక్క సంచలన నిర్ణయం. షాక్ లో ఆమె భర్త

Mamatha Reddy
బుల్లితెరపై అత్యధిక అభిమానులు ఉన్న సీరియల్ ఏదంటే ఠక్కున గుర్తొచ్చేది కార్తీక దీపం. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఈ సీరియల్ సాధించిన రేటింగ్ మరే సీరియల్ కు రాలేదంటే అతిశయోక్తి కాదు. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత ఏడాదిగా కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. ఇందులో ప్రతీ క్యారెక్టర్ కు గొప్ప ఆదరణ లభించింది. ముఖ్యంగా వంటలక్క  అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ షేర్ చాలా ఉంది. ఇప్పటికే  మళయాళంలో కారుముత్తు సీరియల్ లోనూ మంచి ఆదరణ పొందింది. దీని రీమేక్ గా వస్తున్న కార్తీక దీపం అంతకన్నా ఎక్కువ సక్సెస్ అయ్యింది.  ఆమె అభినయం, అందంతో బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. సీరియల్  రేటింగ్స్ కు ప్రేమి ముఖ్య కారణమనే చెప్పాలి

కార్తీక దీపం సాధించిన రేటింగ్స్ తో ప్రేమికి చాలా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రంగం నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉంది ప్రేమి. డేట్స్ అడ్జస్ట్ చేయడం తలకు మించిన భారమే. అందుకే ఆమె కార్తీక దీపం సీరియల్ వైపే మొగ్గు చూపించింది.
అయితే సీరియల్ చేస్తూనే తన డేట్స్ తో అడ్జస్ట్ అయ్యే చిన్న చిన్న సినిమాల్లో మాత్రమే నటిస్తానని చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితమవుతుందని అర్ధమవుతోంది.  కార్తీక దీపం సీరియల్ కోసం ఆమె ఇప్పటికే హైదరాబాద్ లో పర్మినెంట్ ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
కార్తీకదీపం ప్రేక్షకులకు హాట్ స్టార్ షాకిచ్చింది. సబ్ స్క్రైబర్లకు రోజూ ఉదయం 6 గంటలకే సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్ చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే అన్ని సీరియళ్లు అప్ లోడ్ అయినా.. కార్తీక దీపం మాత్రం అప్ లోడ్ కావడం లేదు. దీంతో ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. దీనికి ఓ రీజన్ ఉంది. ముందుగానే స్టోరీ లీక్ అయితే సాయంత్రం ప్రసారమైనప్పుడు సస్పెన్స్ మెయిన్ టెన్ కావడం లేదని .. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: