వీరిద్దరి మధ్య నిజంగా అదే ఉందా..బయటపడ్డ అసలు నిజం..!!
ఈ మేరకు ఆదివారం మాములుగా ఉండదు అని స్టార్ మా మరో కొత్త షో ను ప్లాన్ చేసింది.ఫిబ్రవరి మొదటి రెండు ఆదివారాలు బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చి ప్రేక్షకులను అలరించాడు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట వచ్చిన వచ్చిన రెండు ప్రోగ్రాంలు బాగానే క్లిక్ అయ్యాయి. ఇంత వరకు జరిగిన సీజన్లు, పాల్గొన్న కంటెస్టెంట్లందరూ కలిసి రావడం తో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.100 పర్సెంట్ లవ్ అంటూ ఆరుగురు రియల్ జంటలు, రీల్ జంటల మధ్య పోటీలను పెట్టారు. ఇందులో భాగంగా బుల్లితెర రీల్ రియల్ జంటలు షోలో గెస్ట్‌లుగా వచ్చారు..
దీప్తి సునయన షణ్ముఖ్ జంట కూడా ఈ షోలో పాల్గొంది. అయితే ఇది రియల్ జంట కేటగిరీలో ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రియల్ జంటలో నిరుపమ్-మంజుల, మధుబాబు-ప్రియాంక వంటి ముచ్చటైన భార్యా భర్తలో జోడి పార్టిసిపేట్ చేసింది.ఒకరి పై మరొకరు ప్రేమను తెలుపుకున్నారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తరువాత మళ్లీ దీప్తి సునయన మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన 21 బహుమతుల్లో అన్నింట్లోనూ లవ్ అనే ఉందంటూ అసలు గుట్టు విప్పేసింది. మొత్తానికి చూస్తుంటే త్వరలోనే ఈ జంట ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తుంది..