మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

Mamatha Reddy
వంటలక్క ఈ పేరు చెప్తే చాల మంది బుల్లి తెర అభిమానులకు ఒక ఎమోషన్. సాయంత్రం అయ్యిందంటే చాలు ఇంట్లో పనులు చక్కదిద్దుకొని అంతా టీవీల ముందే వాలిపోతారు. కొన్ని ఏళ్లుగా ఈ సీరియల్ టాప్ 1 లో దూసుకుపోతుంది. మొదటగా మలయాళంలో ఈ సీరియల్ కారుత‌ముత్తు అనే పేరుతో ఘన విజయం సాధించింది. ఆ లైన్ ని తీసుకొని తెలుగు లో కార్తీక దీపం అనే పేరు తో కొన్ని మార్పులు చేర్పులు చేసి వండి వడ్డిస్తున్నారు. మలయాళం సీరియల్ కి దక్కిన ఆదరణ ఇక్కడ తెలుగులోనూ దక్కుతుండటం తో సీరియల్ సాగదీత ఆగడం లేదు. ఏది ఏమైనా సీరియల్ ద్వారా అనేక మంది నటులు సూపర్ పాపులర్ అయ్యారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ గురించే.

ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానే చేరువయ్యింది ప్రేమి. ఇక అప్పుడే ఆమె భర్త తో కలిసి హీరో సుమంత్ ని పెట్టి ఒక సినిమాను కూడా నిర్మిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వంటలక్క ఎంత ఫెమస్ అంటే ఆమెకు సంబందించిన అన్ని విషయాలు కూడా అలాగే వైరల్ అవుతూ ఉంటాయి. కేరళలో పుట్టిన ఈ నల్ల కాలువ కార్తీక దీపం సీరియల్ లో ఎక్కువగా చదువుకొని పాత్రలో నటిస్తున్నప్పటికీ రియల్ లాయిడ్ లో మాత్రం  చాల పెద్ద చదువులే చదివారా. నిజానికి మన వంటలక్క కేరళలో law పూర్తి చేసిందట. అనుకోకుండా ఇండస్ట్రీ కి రావడం తో ఆమె చదివిన చదువును పక్కకు పెట్టి షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. ఇక ప్రేమి సోదరుడు ఒక ఫోటో గ్రాఫర్ కావడంతో ఆమె కి సంబందించిన ఫోటోలను తీసి  కారుత‌ముత్తు డైరెక్ట‌ర్ కి పంపించగా, వారు ఒకే చేయడం తో నటిగా మారింది. ఆ తర్వాత తెలుగు లోకూడా ఆమెనే కంటిన్యూ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: