జబర్దస్త్ వల్ల వచ్చింది ఏం లేదు : శాంతి స్వరూప్ సంచలన వ్యాఖ్యలు

Mamatha Reddy
ఎనిమిదేళ్ల పాటు విజయవంతంగా కొనసాగుతున్న బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను చమ్మక్ చంద్ర, హైపర్ ఆది ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో టాలెంటెడ్ కామెడియన్లను ఇండస్ట్రీకి కూడా జబర్దస్త్ కార్యక్రమమే పరిచయం చేసింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న ఎందరో కళాకారులకు జబర్దస్త్ షో మరొక సగౌరవమైన జీవితాన్ని ప్రసాదించింది.
అయితే అప్పట్లో సరిగ్గా తినడానికి తిండి లేని హాస్యానటులే ఇప్పుడు పెద్ద కార్లలో తిరుగుతూ పెద్ద ఇళ్ళల్లో జీవితాన్ని సాగిస్తున్నారు. వీళ్ళ లైఫ్ స్టైల్ ను చూసి సామాన్య ప్రజలు ఖంగు తింటున్నారు. ఈటీవీ యాజమాన్యం జబర్దస్త్ హాస్యనటులకు లక్షల్లోనే రెమ్యూనరేషన్ ఇస్తుందని సామాన్య ప్రజలు భావిస్తుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో పారితోషికం అందుతుందనే టాక్ ఎప్పటినుంచో ఉంది. అయితే అదంతా అబద్ధం అని ప్రముఖ హాస్యనటుడు శాంతి స్వరూప్ చెబుతున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లోన్ ఇంటర్వ్యూ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ తమకు ఎంత పారితోషికం వస్తుందో చెప్పి షాక్ ఇచ్చారు.
ఒక్కో ఎపిసోడ్ కి 5 వేల నుంచి పదివేల లోపు వస్తాయని ఆయన అన్నారు. కొందరికి మరీ దారుణంగా 2,500 చొప్పున ఇస్తారని ఆయన అన్నారు. బయట అందరూ అనుకున్నట్టు తమకు లక్షల్లో రెమ్యూనరేషన్ రాదని.. అలా వస్తే ఇప్పటికే తాము కోటీశ్వరులం అయ్యేవారమని ఆయన చెప్పుకొచ్చారు. జబర్దస్త్ కంటే బయట ఈవెంట్స్ లో కామెడీ చేయడం ద్వారా తమకు ఎక్కువగా డబ్బులు వస్తాయని శాంతిస్వరూప్ చెప్పారు. జబర్దస్త్ స్టేజ్ తమకి మంచి ఫేమ్, నేమ్ ఇచ్చిందని.. ఆ పాపులారిటీ తోనే తాము బయట కూడా నాలుగు రాళ్ళు సంపాదించుకోగలుగుతున్నామని శాంతి స్వరూప్ చెబుతున్నారు. ఏమైనా జబర్దస్త్ షో దయవల్ల కళాకారులు తమ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: