రూల్స్ బ్రేక్ చేసిన వంటలక్క.. విషయం ఏంటంటే!

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: వంటలక్క అనే పేరు వినపడితే చాలు తెలుగు రాష్ట్రాల్లో గృహిణులందరూ ఎక్కడఉన్నా టీవీ ముందు వాలిపోతారు. ఆమెకున్న పాపులారిటీ అలాంటిది. కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క పాత్రద్వారా ప్రేమీ విశ్వనాథ్ ఈ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆమె ఆ సిరీయల్ మినహా మిగతా ఏ సీరియల్‌లోనూ ఇప్పటివరకు నటించలేదు. మరి వేరే ఎక్కడా నటించకూడదని రూల్ ఏమైనా ఉందా..? లేక ఆమె తనకు తాను ఈ రూల్ పెట్టుకుందా..? అనేది తెలియదు. అయితే ప్రస్తుతం వంటలక్క ఈ రూల్ బ్రేక్ చేయబోతోంది. ఓ యాడ్ ఫిలింల్ కనిపించింది.         
వంటలక్క తన కెరీర్‌లోనే తొలిసారి సీరియల్స్ కాకుండా ఓ యాడ్‌లో నటిస్తోంది. అది కూడా ఒంటిరిగా కాదు.. కార్తీక దీపం సీరియల్‌లో తను ప్రేమించే డాక్టర్ బాబుతో కలసి నటించనుంది. వారిద్దరూ నటించబోతున్న అడ్వర్‌టైస్మెంట్ ఓ ఇన్ ఫ్రా కంపెనీకి సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ యాడ్ ప్రస్తుతం కొన్ని తెలుగు ఛానల్స్‌లో ప్రసారం అవుతోంది. అయితే ప్రేమీ విశ్వనాథ్‌ను సీరియల్ మినహా బయట ఎక్కడా చూడని అభిమానులు ఇప్పుడు డాక్టర్ బాబుతో కలిసి ఇలా ఓ యాడ్‌లో చూడడంతో ఆశ్చర్యపోతున్నారు.             
ఇదిలా ఉంటే ఈ సీరియల్ కేవలం తెలుగులోనే ప్రసారమవుతున్నా చానల్ రేటింగ్స్ భారీగా పెంచుతోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌కు తెలుగురాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. స్త్రీలు మాత్రమే కాదు పురుషుల్లో కూడా ఈ సీరియల్‌కు అభిమానులున్నారంటే ఇక ఈ సీరియల్ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోండి. అంతేకాదు.. బుల్లితెరపై భారీ రియాలిటీ షో బిగ్ బాస్‌కు సైతం ఈ సీరియల్ భారీ పోటీ ఇచ్చింది. కొన్ని సార్లయితే ఏకంగా బిగ్‌బాస్ రేటింగ్‌ను కూడా దాటేసింది. కార్తీక దీపం సీరియస్ స్టార్ మా ఛానల్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది.              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: